laundry shop offer
US laundry shop offer : నిరుద్యోగుల కష్టాలకు అంతే ఉండదు. ఏదైనా ఉద్యోగంలో చేరేవరకూ తినే తిండి పొదుపు పాటించాలి. , కట్టుకునే బట్టలు తక్కువే ఉంటాయి. ఇక ఇంటర్వ్యూలకి వెళ్లాలంటే డ్రెస్సింగ్ చక్కగా ఉండాలి. లేదంటే ఫెయిలయ్యేది మొదటగా అక్కడే. నిరుద్యోగుల కష్టాలు గుర్తెరిగిన అమెరికాలోని ఓ లాండ్రీ స్టోర్ (laundry store ) వాళ్లు వాళ్లకోసం ఓ మంచి పని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇంటర్వ్యూకి వెళ్లాలంటే ముందుగా మన డ్రెస్సింగ్ బాగుండాలి. అక్కడే మొదటగా ఇంప్రెషన్ పడుతుంది. నిరుద్యోగులకు క్లాస్ట్లీ దుస్తులు ధరించాలన్నా .. ఇక ఉన్నవాటిని నీట్ గా రెడీ చేసుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే. అలాంటి వారికి హెల్ప్ చేయాలని పూనుకుంది యూఎస్ (US) ఓక్లహోమాలోని (Oklahoma) ఆర్చర్ క్లీనర్స్ (Archer Cleaners) లాండ్రీ స్టోర్. నిరుద్యోగులై ఇంటర్వ్యూలకు వెళ్తే సమయంలో ఇబ్బంది పడుతున్న వారికి తాము ఉచితంగా దుస్తులు శుభ్రం చేసి ఇస్తామని తమ స్టోర్ విండోలో ఓ ప్రకటన పెట్టింది. ఇక ఈ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా లాండీ స్టోర్ నిర్వాహకులు చేస్తున్న మంచి పనిని మెచ్చుకుంటున్నారు.
Hiring In USA: హమ్మయ్య..! అమెరికాలో ఆ ఒక్క నెలలోనే ఐదు లక్షల మందికి కొత్త ఉద్యోగాలు ..
ప్రపంచంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని కొందరు.. ఇంత మంచి పని చేస్తున్న ఆర్చర్ క్లీనర్ లాండ్రీ స్టోర్ వారికి ధన్యవాదాలు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఓక్లహోమాలో ఈ స్టోర్ కి సంబంధించి పలు బ్రాంచ్ లు కూడా ఉన్నాయి. ఇలా తమ బ్రాంచ్ లన్నీంటి ద్వారా నిరుద్యోగులకు ఈ స్టోర్ ఈ సేవలు అందిస్తోంది. ఈ స్టోర్ చేస్తున్న సాయానికి మనం అభినందిద్దాం.