Indian Origin Woman : అమెరికాలో భారత సంతతి మహిళ అరుదైన ఘనత
భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు.

Indian Origin Woman : భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె టెక్సాస్ లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 1970లో మన్ ప్రీత్ తండ్రి అమెరికాకు వెలస వెళ్లారు. దీంతో ఆమె హ్యూస్టన్ లోనే పుట్టి పెరిగారు.
భర్త, ఇద్దరు పిల్లలతో ఆమె ఇప్పుడు బెల్లయిరేలో నివాసం ఉంటుంది. హ్యుస్టన్ లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేశారు. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసులను కూడా ఆమె వాదించడం గమనార్హం.