US Man : కరోనా రోగికి రూ. 22 కోట్ల బిల్లు!

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతను ఆనందంగా ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన సమయంలో ఆసుపత్రి వాళ్లు వచ్చిన బిల్లును చేతిలో పెట్టారు.

US Man : కరోనా రోగికి రూ. 22 కోట్ల బిల్లు!

America

Updated On : June 28, 2021 / 9:35 PM IST

Covid-19 Hospital Treatment : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. లక్షల రూపాయల బిల్లు వేస్తుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాగే..ఆసుపత్రి వేసిన బిల్లు చూసి షాక్ తిన్నాడు ఓ కరోనా పేషెంట్. వైరస్ ను జయించినా..బిల్లు ఎలా కట్టాలంటూ..తలబాదుకుంటున్నాడు. బిల్లును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతను ఆనందంగా ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన సమయంలో ఆసుపత్రి వాళ్లు వచ్చిన బిల్లును చేతిలో పెట్టారు. బిల్లును చూసిన అతనికి గుండెపోటు వచ్చిన పనైంది. ఒకటి కాదు..రెండు కాదు..3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 22 కోట్లు)..బిల్ చూసి బెంబేలెత్తిపోయాడు. దీనికి సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైరల్ గా మారి కొద్ది రోజుల్లోనే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.