US Man Wins : అదృష్టం తలుపు తట్టింది..లాటరీలో కోట్లు గెలుచుకున్నాడు

స్నేహితుడి నుంచి మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టికెట్ లు తీసుకున్నాడు. సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేశాడు.

US Man Wins : అదృష్టం తలుపు తట్టింది..లాటరీలో కోట్లు గెలుచుకున్నాడు

Man Wins

Updated On : December 3, 2021 / 7:11 AM IST

Rs 7 Crore Lottery : అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. లక్ష్మీదేవిని అతని ఇంటికి తీసుకువచ్చింది. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే. కోట్లాది మంది లాటరీలను కొనుగోలు చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ.. ఎప్పుడో ఒకసారి జాక్ పాట్ తగులుతుంది. రాత్రికి రాత్రే లక్షాదికారి..కోటీశ్వరులు అయిపోతారు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా…ఓ వ్యక్తికి అనూహ్యంగా లాటరీ టికెట్ దక్కింది.

Read More : Nikita Dutta : బాలీవుడ్ నటిపై దుండగుల దాడి… బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది

కేవలం 20 డాలర్లు (రూ. 1500) పెట్టి కొన్న లాటరీకి ఏకంగా రూ. 6,50,000 (రూ. 4.8 కోట్లు) రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉంటున్న అతనికి ఈ లాటరీ దక్కింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మసాచుసెట్స్ లో అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని…ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Read More : CM Arvind Kejriwal: ఆ దేశాల నుంచి విమానాలు ఆపకపోవడం విచారకరం

అతని స్నేహితుడి నుంచి మూడు లాటరీ స్క్రాచ్ ఆఫ్ టికెట్ లు తీసుకున్నాడు. సర్జరీ అనంతరం మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేశాడు. వన్ మిలియన్ లాటరీ గెలుచుకున్నాడు. మొత్తం అన్ని పన్నులు పోయిన తర్వాత..అతని చేతికి రూ. 4.8 కోట్లు వచ్చాయి. కానీ..కేవలం రూ. 20 డాలర్లు పెట్టిన లాటరీ టికెట్ కు రూ. 6,50,000 డాలర్లు రావడంతో మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.