US-Iran War : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం! గల్ప్‌లో సైరన్ల మోత..
US-Iran War : హర్మూజ్ జలసంధిలోని నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా అమెరికా నౌకాదళం, వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు రాత్రి హోర్ముజ్ జలసంధిలో, దాని సమీపంలోని పలు ప్రదేశాలలోఉన్న 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి.
US-Iran War
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..
- ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
- ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే.. ట్రంప్ వార్నింగ్
US-Iran War : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ పై అమెరికా వరుసగా రెండోరోజు దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్ పై వైమానికి దాడులు చేస్తోంది. దక్షిణ ఇరాన్ లోని సిరిక్, బందర్, ఎ-లెంగెహ్, ఖష్మ్ ద్వీపం ప్రాంతాల్లో ఉన్న సైనిక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
Also Read : Karnataka Car Explosion : ప్రియురాలిపై కత్తితో దాడి.. క్షణాల్లో కారులో పేలుడు.. కర్ణాటకలో సంచలన ఘటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ నిఘా సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల నిల్వల కేంద్రాలపై తమ యుద్ధ విమానాలు బాంబులు కురిపించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. కాల్పుల విరమణ ఉల్లంఘించకుండా ఉండేందుకు ఇరాన్ కు అవకాశం ఇచ్చినా మళ్లీ ఆ దేశం దాడులు చేస్తోందని, పనామా జెండాతో చమురుతో వెళ్తున్న కికు ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు, దీంతో తాము తాజాగా దాడులు చేసినట్లు అమెరికా బలగాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెహ్రాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. దాడులు కొనసాగితే సైనికంగా పూర్తిగా ముగిస్తాం.. ఇరాన్ పై మరిన్ని దాడులు చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సర్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో మరోసారి అమెరికా – ఇరాన్ తాజా ఘర్షణలతో ట్రెహాన్ ప్రజల్లో మళ్లీ యుద్ధ భయాలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత సున్నితంగా ఉందో ఈ పరిణామాలను బట్టి అర్ధమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇరు దేశాలు మరిన్ని సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో.. మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంటగంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిస్తోంది. మరోవైపు.. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఆయా దేశాలు సైరన్ల మోత మోగిస్తున్నాయి.
U.S. Navy and Air Force fighter jets conducted strikes tonight on 10 Iranian military targets at multiple locations in and near the Strait of Hormuz for Iran’s drone attack on M/T Kiku. pic.twitter.com/Z0TLZRqmF6
— U.S. Central Command (@CENTCOM) June 28, 2026
