US Military Plane : కుప్పకూలిన యూఎస్ సైనిక విమానం
నవంబర్ 10 సాయంత్రం తూర్పు మధ్యధరా ప్రాంతంలో శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూఎస్ సైనిక విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపింది.

US Military Plane Crash
US Military Plane Crash : యూఎస్ సైనిక విమానం కుప్పకూలిపోయింది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో శిక్షణ సమయంలో అమెరికా సైనిక విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ శనివారం తెలిపింది. అయితే ఈ విమానం ఎక్కడి నుండి వచ్చిందన్న విషయం తెలియలేదు.
నవంబర్ 10 సాయంత్రం తూర్పు మధ్యధరా ప్రాంతంలో శిక్షణా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూఎస్ సైనిక విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం వల్లే విమానం కుప్పకూలిందని, శత్రువులు కూల్చినట్లు ఎటువంటి సూచనలు లేవని ప్రకటనలో పేర్కొంది. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయ సంఘర్షణగా మారకుండా నిరోధించే ప్రయత్నాలలో భాగంగా యూఎస్ ఆ ప్రాంతానికి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మోహరించింది. వాషింగ్టన్ ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతును అందించింది. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక, ఇతర యుద్ధనౌకలతో సహా తన బలగాలను మోహరించింది.
అనంతరం అక్టోబరు 7న గాజా నుండి హమాస్ దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపిందని ఇజ్రాయెల్ అధికారులు తెలపారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై కనికరంలేకుండా వాయు, భూమి, నావికా మార్గాల్లో దాడితో చేయడంతో 11,000 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.