China Spy Balloon: సముద్రం నుంచి బయటకొచ్చాయి.. చైనా బెలూన్ శిథిలాల ఫొటోలను విడుదల చేసిన అమెరికా నౌకాదళం ..

అమెరికా గగనతలంపై కనిపించిన చైనా గూఢచార బెలూన్ ను అమెరికా సైన్యం పేల్చివేసిన విషయం విధితమే. భారీకాయం కలిగిన బెలూన్ శిథిలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో పడ్డాయి. వాటిని అమెరికా నౌకాదళం బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసింది.

China Spy Balloon: అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా గూఢచార బెలూన్‌ను అమెరికా సైన్యం ఫైటర్ జెట్ ఎఫ్-22 క్షిపణితో కూల్చివేసిన విషయం విధితమే. భారీకాయం కలిగిన ఈ బెలూన్ శిథిలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో పడ్డాయి. వాటిని నౌకాదళ అధికారులు వెలికి తీశారు. సముద్రంలో బెలూన్ శిథిలాలు పడిన ప్రదేశాన్ని గుర్తించిన అమెరికా నావికాదళం సిబ్బంది.. బోటు సహాయంతో సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్ వద్దకు బెలూన్ శిథిలాలను తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను యూఎస్ ఫ్లీట్ ఫోర్సెస్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.

China Spy Balloon

అమెరికా గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా బెలూన్‌ను అమెరికా పేల్చివేసింది. గత శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్‌ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

China Spy Balloon

ఈ ఘటనపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. ‘‘సాధారణ పౌర అవసరాలకోసం వినియోగించే వాయు నౌక (బెలూన్)ను అమెరికా కూల్చివేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. దీని ద్వారా అమెరికా అతిగా స్పందించింది’’ అని చైనా విమర్శించింది. ఇదిలాఉంటే.. అమెరికా పౌరులకు ఎలాంటి ముప్పు కలగకూడదనే ఆ బెలూన్ పేల్చివేసినట్లు ఆ దేశ రక్షణశాఖ అధికారులు తెలిపారు.

China Spy Balloon

చైనా తన వద్దఉన్న బెలూన్లతో చాలా దేశాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇండియాను కూడా డ్రాగన్ బెలూన్లు టార్గెట్ చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోందని అన్నారు.

China Spy Balloon

జపాన్, ఇండియా, తైవాన్, పిలిప్పీన్స్‌, వియాత్నాలో ఉన్న వ్యూహాత్మక కీలక ప్రాంతాలను చైనా బెలూన్లు టార్గెట్ చేసినట్లు ద వాషింగ్టన్ పోస్టు తాజాగా తన కథనంలో పేర్కొంది. రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులతో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఆ రిపోర్టును ద వాషింగ్టన్ పోస్టు తయారు చేసింది.

China Spy Balloon

ట్రెండింగ్ వార్తలు