Trump Health Rumors: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిస్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ట్రంప్ రెండు రోజుల నుంచి జనాలకు కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు నడుస్తున్నాయి.. ఆల్రెడీ ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలు నెలకొంటున్నాయి. ఆయన చేతి మీద పెద్ద మచ్చ ఉన్న ఫొటో బయటకు వచ్చింది. అలాగే కాళ్ల వాపు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే తాను అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రెడీగా ఉన్నానని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడం కూడా సంచలనంగా మారింది.
ట్రూత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా
ఆగస్టు 30, 31వ తేదీల్లో ట్రంప్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఏమీ లేదు. దీంతో జనాల పుకార్లకు మరింత ఆజ్యం పోస్తుంది. ట్రంప్ ఆరోగ్యంపై (Trump Health Rumors) మరింత ఆందోళన కలిగిస్తోంది. జనాలకు కనిపించకపోయినా, పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనకపోయినప్పటికీ ఆన్ లైన్లో మాత్రం ట్రంప్ అకౌంట్స్ యాక్టివ్ గా ఉన్నాయి. తన సొంత సోషల్ ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
లోకల్ కోర్టు తీర్పు పై ట్రంప్ స్పందన
ట్రంప్ తెచ్చిన టారిఫ్ ల్లో చాలా వరకు ఇల్లీగల్ అని.. అవి చెల్లవంటూ అమెరికా లోకల్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ స్పందించారు. కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందన్న ట్రంప్ టారిఫ్ లు కొనసాగుతాయని ప్రకటించారు. లోకల్ కోర్టు తీర్పు మీద పై కోర్టుకు వెళ్లనున్నారు.
చేతి మీద ఏమైందంటే..
ట్రంప్ చేతి మీద నల్లటి మచ్చ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపై ట్రంప్ డాక్టర్ స్పందించారు. ఎక్కువగా హ్యాండ్ షేక్స్ ఇవ్వడం వల్ల టిష్యూస్ దెబ్బతిన్నాయని.. అతిగా యాస్ప్రిన్ వాడకం వల్ల అలా అయిందని చెప్పారు. ట్రంప్ దిట్టంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పారు.