Joe Biden Dating Advice: నా కుమార్తె, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చా.. బాలికకు డేటింగ్ విషయంలో జో బైడెన్ సలహా.. వీడియో వైరల్​!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి డేటింగ్ విషయంలో ఊహించని సలహా రావడంతో బాలిక తొలుత ఆశ్చర్యపోయింది. ఏం చెప్పాలో తెలియక కొంత అసౌకర్యానికి గురైంది. వెంటనే తేరుకొని ఓకే, నేను దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను అంటూ సమాధానం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను 5.2మిలియన్ల మంది వీక్షించారు.

Joe Biden Dating Advice: నా కుమార్తె, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చా.. బాలికకు డేటింగ్ విషయంలో జో బైడెన్ సలహా.. వీడియో వైరల్​!

Joe Biden Dating Advice To Girl

Updated On : October 17, 2022 / 8:32 AM IST

Joe Biden Dating Advice: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ బాలికకు డేటింగ్ విషయంపై సలహా ఇచ్చాడు. అంతేకాదు.. నా కుమార్తె, మనవరాళ్లకు కూడా ఇదే సలహా ఇచ్చానంటూ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన సలహాకు తొలుత బాలిక అసౌకర్యంగా కనిపించింది. వెంటనే తేరుకొని నవ్వుతూ, బైడెన్ సలహాను తన మనస్సులో ఉంచుకుంటానంటూ బదులిచ్చింది.

Elephant In Children Park: పిల్లల పార్కులో ఏనుగు సందడి.. టైర్లతో ఫుట్‌బాల్ ఎలా ఆడిందో చూండిండి.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్యాంపస్‌లో విద్యార్థులతో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో ఓ బాలిక బైడెన్ వద్దకు రాగానే ఆమెను దగ్గరకు తీసుకొని ఫొటో దిగారు. ఈ క్రమంలో తనముందు నిలుచున్న బాలిక భుజంపై చేతులువేసి, ఆ బాలికకు బైడెన్ సలహా ఇచ్చాడు. 30ఏళ్లు వచ్చేవరకు సీరియస్‌ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లొద్దంటూ డేటింగ్‌ సలహా ఇచ్చారు. అయితే, తన కుమార్తెలు, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చానని బైడెన్ పేర్కొన్నారు.

బైడెన్ నుంచి ఊహించని సలహా రావడంతో బాలిక తొలుత ఆశ్చర్యపోయింది. ఏం చెప్పాలో తెలియక కొంత అసౌకర్యానికి గురైంది. వెంటనే తేరుకొని ‘ఓకే, నేను దీన్ని దృష్టిలో ఉంచుకుంటాను’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ వీడియోను 5.2మిలియన్ల మంది వీక్షించారు. కాగా, దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అధ్యక్షుడి సలహాతో బాలిక అసౌకర్యానికి గురైంది, ఆమెకు ఎలా స్పందించాలో తోచలేదు అంటూ కొందరు పేర్కొన్నారు. అయితే, బాలిక ఇబ్బంది పడలేదని, అధ్యక్షుడు ఆప్యాయంగా భుజం మీద చేయివేస్తే ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైందని బైడెన్‌కు మద్దతు మరికొందరు ట్వీట్లు చేశారు.