Joe Biden: నాటో దళాలతో సెల్ఫీలు దిగుతూ, పిజ్జా పార్టీ చేసుకున్న బైడెన్

యుక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలో నాటో సైనికులతో పాటు యుక్రెయిన్ శరణార్థులను బైడెన్ కలుసుకున్నారు.

Biden

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ చేరుకున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన బైడెన్..ప్రస్తుతం రష్యా పొరుగు దేశం పోలాండ్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలో నాటో సైనికులతో పాటు యుక్రెయిన్ శరణార్థులను బైడెన్ కలుసుకున్నారు. ఈసందర్భంగా అమెరికా ఆర్మీ యొక్క 82వ వైమానిక విభాగానికి చెందిన సానికులతో బైడెన్ కాసేపు గడిపారు. వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ పిజ్జా పార్టీ చేసుకున్నారు బైడెన్. అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ యుద్ధ నేరస్తుడంటూ మరోసారి విమర్శించారు.

Also Read:Kim Jong Un: అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా నియంత కిమ్.. Hwasong-17 క్షిపణి ప్రయోగం..

కాగా, రెండో ప్రపంచయుద్ధం తర్వాత.. ఒక యుద్ధ ప్రాంతానికి సమీపంగానూ వెళ్లడం, యుద్ధం కారణంగా నష్టపోయిన ఒక దేశ ప్రజలను అమెరికా అధ్యక్షుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పోలాండ్‌లో సుమారు 20 లక్షల మంది యుక్రెయిన్ శరణార్థులు ఉన్నారు. యుక్రెయిన్ శరణార్ధుల గురించి బైడెన్.. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధం కారణంగా శరణార్ధులు తీవ్రంగా నష్టపోయారని, వారి హృదయాలు పగిలిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఆండ్రెజ్ దుడా వివరించారు. పోలాండ్ అధ్యక్షుడితో కలిసి బైడెన్ శనివారం క్రేనియన్ శరణార్థులు మరియు యుఎస్ మానవతా సహాయ వాలంటీర్లను కూడా కలువనున్నారు.

Also read:Uddhav Thackeray : దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి : ఉద్ధవ్‌ ఠాక్రే

అనంతరం మీడియాతో మాట్లాడిన జో బైడెన్ యుద్ధం జ్ జరుగుతున్నా సమయంలో భద్రతా కారణాల వల్ల యుక్రెయిన్‌కు వెళ్లనందుకు బాధపడ్డానని, యుక్రెయిన్ ప్రజలు తనను క్షమించాలని బైడెన్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ శరణార్ధులను ఆదుకోవడంలో పోలాండ్ దేశం మానవతా దృక్పధం ప్రదర్శించడం అభినందనీయమని బైడెన్ అన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శరణార్థులను ఆదుకోవడంలో ర్జెస్జో ప్రాంతం మానవతా సహాయానికి ప్రధాన కేంద్రంగా మారిందని బైడెన్ అన్నారు. పుతిన్ దూకుడు యూరప్‌లో విధ్వంసం సృష్టిస్తోందని.. యుక్రెయిన్‌ను జయించాలనే రష్యా ఆశయాలను చెదరగొట్టాలని బైడెన్ పిలుపునిచ్చారు.

Also Read:Russia Ukraine: యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం పూర్తయిందన్న రష్యా: ఆ తరువాత ఏంటి?