Lloyd Austin : బూస్టర్ డోసు తీసుకున్నా..అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్‌

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కరోనా బారినపడ్డారు. రెండు వ్యాక్సిన్ డోసులతో పాటు బూస్టర్ డోసు వేయించుకున్నా మంత్రికి కోవిడ్ సోకింది.

Us Secretary Of Defense Lloyd Austin Tests Covid Positive

Lloyd Austin : అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతు హడలెత్తిస్తున్నాయి. లక్షలమంది మరోసారి మహమ్మారి బారినపడ్డారు. అలా ఇప్పటివరకు 5,61,42,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,47,408 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో కరోనా పరిస్థితి ఇలా ఉంటే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కరోనా బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవటంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్‌లో ఉన్నారు.

Read more : Telangana Vaccination : తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు

తనకు కోవిడ్ సోకిందని నిపుణుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉంటానని మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ స్వయంగా వెల్లడించారు. తాను వ్యాక్సిన్‌ తీసుకున్నాని..అంతేకాదు 2021 అక్టోబర్‌లో బూస్టర్‌ డోస్‌ కూడా వేసుకున్నానని తెలిపారు. తాను 2021 డిసెంబర్‌ 21న అధ్యక్షుడు బైడెన్‌ను కలిసానని..ప్రతిఒక్కరు బూస్టర్‌ డోసు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

అమెరికాలో ఇప్పటివరకు 5,61,42,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,47,408 మంది మరణించగా, 4,15,43,060 మంది కోలుకున్నారు. మరో 1,37,51,707 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇలా చాపకింద నీరులా యూఎస్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Read more : Omicron : ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్.. ఇక ఆందోళనక్కర్లేదు..!