Woman stabs Student: బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థినిని కత్తితో పొడిచిన మహిళ

Woman stabs Student: బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థినిని కత్తితో పొడిచిన మహిళ

Student

Updated On : January 15, 2023 / 1:17 PM IST

Woman stabs Student: అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయ విద్యార్థిని (18)పై బస్సులో జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఓ మహిళ (56) దాడి చేసింది. నువ్వు ఆసియాకు చెందిన వ్యక్తివి అంటూ ఆ విద్యార్థి తలపై మహిళ కత్తితో పలుసార్లు పొడిచింది. దీంతో ఆ విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ మహిళను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు తెలిపారు.

బ్లూమింగ్టన్ లో బస్సులో తాను డోరు వద్ద నిలబడ్డానని, ఆ సమయంలో ఓ మహిళ తన తలపై పొడుస్తూ దాడి చేసిందని బాధిత అమ్మాయి తెలిపింది. దీంతో పోలీసులు బస్సులోని సీసీటీవీ కెమెరాను పరిశీలించారు. ఆ విద్యార్థినిపై దాడి జరగకముందు ఆమెతో నిందిత మహిళతో ఎలాంటి గొడవ జరగలేదని పోలీసులు నిర్ధారించారు.

అనంతరం కేసు నమోదుచేసుకుని, నిందిత మహిళను బ్లూమింగ్టన్ కు చెందిన బిల్లీ ఆర్.డేవిస్ గా గుర్తించి, అరెస్టు చేశారు. డేవిస్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాధిత బాలిక తలపై గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. నిందితురాలు జాతి వివక్షతోనే విద్యార్థినిపై దాడి చేసిందని పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.

BSP Chief Mayawati: పొత్తులుండవ్..! లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది..