కూరగాయల మార్కెట్‌ను చూడడానికి వెళ్లి.. కాల్చి వచ్చిన పిల్లాడు.. వీడియో వైరల్

Viral Video: లైటర్ తో నిప్పు అంటించాడు. అనంతరం తన తల్లి వెనకకు వెళ్లి దాక్కున్నాడు.

కూరగాయల మార్కెట్‌ను చూడడానికి వెళ్లి.. కాల్చి వచ్చిన పిల్లాడు.. వీడియో వైరల్

లైటర్‌ పట్టుకుని కూరగాయల మార్కట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేశాడు ఓ పిల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. ఓ పిల్లాడు తల్లితో పాటు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. తల్లి కూరగాయలు తీసుకుంటున్న సమయంలో ఆమె పక్కనే ఉన్న ఆ బాలుడు తనతో పాటు తెచ్చుకున్న లైటర్ ను బయటకు తీశాడు. దుకాణదారులు కూరగాయలు ఉంచి ప్రాంతంలో లైటర్ తో నిప్పు అంటించాడు.

అనంతరం తన తల్లి వెనకకు వెళ్లి దాక్కున్నాడు. నిప్పు అంటిస్తే ఎంతగా నష్టం వస్తుందో కూడా తెలియదు ఆ బాలుడికి. మంటలను గమనించిన మరో మహిళ వెంటే స్పందించి ఆ షాపు యజమానురాలికి చెప్పింది. దీంతో చివరకు దుకాణ యజమానురాలు నీళ్లు పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.