Man turned into a dog : అయ్యో! అతను శునకంలా మారిపోయాడు.. ఎక్కడో తెలుసా?
ఎవరికైనా జంతువులా మారిపోవాలని కోరిక పుడుతుందా? వింత ప్రశ్న అనుకోకండి. ఓ వ్యక్తికి డాగ్‌లాగ మారిపోవాలని అనిపించింది. అందుకోసం అతను ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు.

Man turned into a dog
Man turned into a dog : టోకో అని వ్యక్తికి జంతువుల మారిపోయి జనం మధ్యలో తిరగాలని అనిపించింది. అంతే శునకంలా మారిపోయాడు. అదెలా సాధ్యం? డబ్బులు ఖర్చుపెడితే సాధ్యం కానిది ఏముంది? అదెలాగో చదవండి.
Dog Viral Video : వీడియో గేమ్ ఆడుతున్న శునకం .. కంప్యూటర్ ఆఫ్ చేయగానే దాని రియాక్షన్ చూడండి
జపాన్‌కి చెందిన టోకో కుక్కలాగ మారిపోయాడు. అతను అలా మారడానికి అక్షరాల రెండు మిలియన్ యెన్ (A$22,000) లు ఖర్చయ్యాయట. ఇక అలా మారిపోయిన టోకో రోడ్లపై నడిచాడు. టీవీ యాడ్స్, సినిమాలకు దుస్తులు తయారు చేసే జపనీస్ జెప్పెట్ కపెనీ టోకో కోసం ప్రత్యేకంగా శునకంలా కనిపించే దుస్తులను తయారు చేసింది. అందుకోసం ఏకంగా 40 రోజులు పట్టిందట. ఈ కంపెనీ రకరకాల బొమ్మలు, బాడీ సూట్లు, 3-డి మోడల్స్ మొదలైనవి రూపొందించడంలో ప్రసిద్ధి చెందినట.
Agra : గుండెలు పిండే విషాదం.. కారులో ఊపిరాడక చనిపోయిన శునకం, వాళ్లసలు మనుషులేనా? ఏం చేసినా పాపం లేదు
టోకో తను డాగ్ లాగ మారిపోయిన వీడియోను తన స్వంత యూట్యూబ్ ఛానెల్ ‘ఐ వాంట్ టు బి యానిమల్’ లో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోకి మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయట. ఈ వీడియో సంవత్సరం క్రితం తీసినా రీసెంట్‌గా అప్ లోడ్ చేశాడట. వీడియోలో టోకో మెడలో గొలుసు ఉంది. అతనిని ఒక యువతి రోడ్డుపైకి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. తను డాగ్ మాదిరిగానే ఇతర కుక్కలతో కనిపిస్తాడు. జనం అంతా అతని చుట్టూ చేరతారు. వీడియో మొత్తంలో ఎక్కడా తన ముఖం చూపించడు. డాగ్ లాగ దుస్తులు ధరించాడు సరే.. అంతసేపు రోడ్లపై నిజంగానే డాగ్ ఏమో అనిపించేలా కనిపించడానికి అతను ఎంత కష్టపడ్డాడో అనిపిస్తుంది.