Viral Video: ఇంత చిన్న పాము ఎంత పెద్ద గుడ్డుని మింగిందో చూడండి..

ఓ వ్యక్తి తన చేతిలో గుడ్డుని పట్టుకోగా మొదట దాన్ని నోట్లోకి తీసుకున్న ఆ పాము మెల్లిగా నోటిని వెడల్పు చేసి, మింగింది.

ఓ చిన్న పాము పెద్ద గుడ్డుని మింగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యామంటూ కామెంట్లు చేస్తున్నారు.

పాములు వాటి దడవలు, నోరు ఉన్న సైజు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వెడల్పు చేయగలవని కొందరు అంటున్నారు. అందుకే ఆ పాము గుడ్డుని అలా మింగగలిగిందని చెబుతున్నారు. ఆ పాము నోటి కంటే ఆ గుడ్డు రెండు రెట్లు అధిక పరిమాణంలో ఉంది. ఓ వ్యక్తి తన చేతిలో గుడ్డుని పట్టుకోగా మొదట దాన్ని నోట్లోకి తీసుకున్న ఆ పాము మెల్లిగా నోటిని వెడల్పు చేసి, గుడ్డుని మింగింది.

ఆ పాము గుడ్డుని తినడం ఒక ఎత్తయితే, ఆ సమయంలో ఈ వీడియో తీయడం మరో ఎత్తని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పాములకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి.

Cyclone Dana: ఏపీకి మరో తుపాను ముప్పు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు