తేజస్సు చూడ తరమా: సూర్యగ్రహణం అందమైన ఫోటోలు.. వైరల్!

  • Publish Date - December 26, 2019 / 05:39 AM IST

పదేళ్ల తర్వాత ఈ సంవత్సరం గురువారం (డిసెంబర్ 26, 2019)న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే ఈ రోజు ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంది. ఉ.10.47 గంటలకు గ్రహణం ముగుస్తుంది.

చెన్నై, అహమదాబాద్, కొచ్చి, భువనేశ్వర్ లో కనిపిస్తున్న సూర్యగ్రహణం. మళ్లీ ఈ స్థాయిలో సూర్యగ్రహణం కనిపించాలంటే 2031 వరకూ ఆగాల్సిందే అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలో చాలా ఆసక్తిగా సూర్యగ్రహణాన్ని చూసి… చాలా మంది భారతీయుల లాగానే నేను సూర్యగ్రహణాన్ని చూద్దామని చాలా ఉత్సాహ పడ్డాను. దురదృష్టవశాత్తు క్లౌడ్ కవర్ కారణంగా నేను సూర్యుడిని చూడలేకపోయానంటూ.. కానీ కేరళలోని కోజికోడ్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రహణం దృశ్యాలను చూశానంటు మోదీ ట్విట్ చేశారు.

ముగిసిన సుర్యగ్రహణం…

 

ఇవాళ ఉదయం 8:08 గంటలకు ప్రారంభమైన సూర్య గ్రహణం 11:11 గంటలకు ముగిసింది. గ్రహణం ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులు ఆలయాలను శుద్ధి చేసి.. భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నారు. అంతేకాదు ప్రజలు తమ నివాసాలను కూడా శుద్ధి చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు