MrBeast: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారులో ప్రయాణించిన యూట్యూబర్.. వీడియో

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లలో అతడు ఒకడు. అతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోని..

MrBeast

YouTuber – MrBeast: అతడి పేరు జేమ్స్ స్టీఫెన్ డోనాల్డ్సన్ (James Stephen Donaldson). కొందరు జిమ్మీ డొనాల్డ్‌సన్ అని కూడా పిలుస్తుంటారు. వయసు 25. మిస్టర్ బీట్స్ పేరిట అతడికి యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఏకంగా 184 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లలో అతడు ఒకడు. అతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూస్తారు. తాజాగా అతడు మరింత వెరైటీ వీడియోను రూపొందించాడు. ఒక్క అమెరికన్ డాలర్ (రూ.83)తో కొన్న కారు మొదలుకుని ప్రపంచంలోనే అత్యధిక ధర ఉండే ఫెర్రారీ (Ferrari) కారు వరకు.. పలు రకాల కార్లలో ప్రయాణించాడు.

ఆ ఫెర్రారీ కారు విలువ 100 మిలియన్ డాలర్లు (రూ.831 కోట్లు). డ్రైవింగ్ అనుభవాన్ని రికార్డు చేయడమే కాకుండా, ఆయా కార్ల ఫీచర్లను కూడా పరీక్షించాడు. ఫ్లయింగ్ కారులోనూ ప్రయాణించాడు. మొట్టమొదటి ఫెర్రారీ కారు ఫెర్రారీ 125 ఎస్‌లోనూ ప్రయాణించి వీడియో తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ లోనూ పోస్ట్ చేశాడు. నాలుగు రోజుల క్రితం అతడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 88 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

TVS Racing Championship : టీవీఎస్ భారత ఫస్ట్ ఫ్యాక్టరీ రేసింగ్ చాంపియన్‌షిప్.. ఆర్టీఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ రేసింగ్ మోటర్‌సైకిళ్లు!