ఒక వాట్సప్ అకౌంట్.. ఎన్ని ఫోన్లలోనైనా

తరచూ ఫోన్లు మార్చేవారికి వాట్సప్ తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ ఫీచర్ భళే ఉపయోగపడుతుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ మరింత త్వరలోనే మార్కెట్లోకి రానుంది. బీటా వెర్షన్లలో సక్సెస్ అవడంతో దీనిపై నమ్మకం వచ్చిందంటున్నారు వాట్సప్ యాజమాన్యం. ఇటీవలే డార్క్ మోడ్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇలా ఒకే ఫోన్ నెంబర్‌తో వాడే అకౌంట్‌ను పలు ఫోన్లలో ఓపెన్ అయ్యేలా చేస్తే మరింత బాగుంటుంది కదా.
ఈ ఫీచర్ ను యాండ్రాయిడ్, ఐఓఎస్, ట్యాబ్లెట్ ఇలా ఏ డివైజ్ లోనైనా వాడుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఫోన్లలో ఒకే అకౌంట్ ను వాడే ఫీచర్ తో పాటు ఎక్స్‌పైరింగ్ మెసేజ్ ఆప్షన్ కూడా రెడీ అవుతుంది. ఈ ఫీచర్ గ్రూప్ మెసేజింగ్ లోనే కాకుండా పర్సనల్ చాటింగ్ లోనూ వాడుకోవచ్చు. మెసేజ్‌కు ఎక్స్‌పైరింగ్ టైం ఫిక్స్ చేస్తే నిర్ణీత సమయం అయిపోయాక కనిపించకుండాపోతుంది.
Testing ?
When someone adds a new device in his WhatsApp account, you will be notified because encryption keys change.Available in future for iOS and Android! pic.twitter.com/WqrM6cRHWW
— WABetaInfo (@WABetaInfo) March 24, 2020
ఇటీవల మరో షాక్ ఇచ్చింది వాట్సప్. సాధారణంగా 30సెకన్ల పాటు ఉండే వాట్సప్ స్టేటస్ ను 15సెకన్లకు తగ్గించినట్లు ప్రకటించింది. వాట్సప్ యాప్ లాంచ్ చేసిన సమయంలో స్టేటస్ 90సెకన్ల నుంచి 3నిమిషాల వరకూ అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండేది. క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఇలా వాట్సప్‌ను లేటెస్ట్ ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ… పోటీ లేకుండా చేస్తుంది ఫేస్‌బుక్.
Also Read | కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు