రష్యా అధికారులను బహిష్కరించిన అమెరికా.. కొత్త ఆంక్షలు

U.S. expels Russian diplomats: పది మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే రష్యాపై కొత్త ఆంక్షలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్ ప్రభుత్వ సంస్థల హ్యాకింగ్‌కు ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంది అగ్రరాజ్యం.

ఇదే సమయంలో రష్యా ప్రభుత్వ రుణాలలో అమెరికా బ్యాంకుల వ్యాపారంపై ఆంక్షలను విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది వ్యక్తులను కూడా బహిష్కరించనున్నట్లు అమెరికా ప్రకటించింది.

రష్యన్ హ్యాకర్లు హానికరమైన కోడ్‌తో విస్తృతంగా ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ను.. ప్రభుత్వ రహస్యాలు తెలుసుకునేందుకు వాడినట్లుగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే శత్రు కార్యకలాపాల కార‌ణంగా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.

రష్యా కానీ, మరెవరు కూడా ఓట్లు మార్చినట్లుగా లేదా ఫలితాన్ని తారుమారు చేసినట్లు ఆధారాలు లేనప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభావిత కార్యకలాపాలకు పాల్పడినట్లుగా అమెరికా అధికారులు ఆరోపించారు.

రష్యాకు స్పష్టమైన ప్రతీకార సందేశాన్ని పంపడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి చర్యలను అరికట్టడానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. జో బైడెన్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్ర‌కారం “రష్యా తన అస్థిర అంతర్జాతీయ చర్యల‌ను కొనసాగిస్తే లేదా పెంచుకుంటే అమెరికా వ్యూహాత్మక, ఆర్ధికంగా ప్రభావవంతమైన రీతిలో ఖర్చులు విధిస్తుందని సంకేతాలను పంపుతోంది.

ట్రెండింగ్ వార్తలు