కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO

కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది.  World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్పుడే ఈ పదాన్ని వాడతారు’  WHOకు చెందిన టెడ్రోస్ ఆధోనమ్ గెబ్రెయేసుస్ బుధవారం వెల్లడించారు. 

50రోజుల నుంచి కరోనా వ్యాప్తిని పరిశీలించిన World Health Organization లక్షా 13వేల కరోనా పాజిటివ్ కేసులు, 4వేల 12మరణాలు నమోదవడంతో ఇలా ప్రకటించింది. జనవరి 21న తొలిసారిగా దీనిపై దృష్టి పెట్టింది. చైనాలోని హుబీ ప్రాంతంలో దీనిని గుర్తించారు. 

WHO హెల్త్ ఎమర్జెన్సీకి డైరక్టర్ గా వ్యవహరించే మైకేల్ ర్యాన్ మామూలు పరిస్థితి దాటిపోయిందని అందుకే మహమ్మారంటూ పేర్కొన్నారు. దీని కోసం అత్యవసరంగా పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

2009లో వేల కొద్దీ ప్రాణాలను హరించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వైరస్ పందుల నుంచి వచ్చేది కావడంతో కాస్త సేఫే. కరోనా మనుషుల తాకిడితో, దగ్గు, తుమ్ములతో వచ్చేది కాబట్టి మరింత ప్రమాదకరం. ఈ వైరస్ నివారణకు సరైన టీకాలు, మందులు, చికిత్సలు అందుబాటులోకి రాకపోవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి రోగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ మహమ్మారి తాకిడికి ప్రపంచంలోని పలు దేశాలు పరాయి దేశాలతో రాకపోకలు కట్టడి చేసేశాయి. ఖతర్ లో ఒక్క రోజులోనే 238కేసులు నమోదయ్యాయి. జర్మనీలో 70శాతం మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వాధికారులు అంటున్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్ నుంచి సేఫ్ గా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. 

కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
* వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయినా సరే మాస్క్‌లు ధరించడం మంచిది. 
* వైరస్‌కు యాంటీ బయోటిక్స్ లేవు. వైద్యులు చెప్పకుండా ఎలాంటి మందులు వేసుకోవద్దు. 
* జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 
* బయట తిరగి వచ్చిన తర్వాత..శుభ్రంగా కడుక్కోవాలి.