WHO : Mu వేరియంట్‌పై స్టడీ చేస్తున్న డబ్ల్యూహెచ్‌వో

కొత్త వేరియింట్ 'Mu' కలకలం రేపుతోంది. ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో ఈ వేరియంట్ డెవలప్ అవుతోందని గుర్తించారు శాస్త్రవేత్తలు.

Mu

Variant MU : కొత్త వేరియింట్ ‘Mu’ కలకలం రేపుతోంది. ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో ఈ వేరియంట్ డెవలప్ అవుతోందని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనిపై who రంగంలోకి దిగింది. కరోనా వేయింట్ ‘Mu’ను సమీక్షిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ వారం రిలీజైన బులెటిన్ లో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వేరియంట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ…అభిప్రాయం వ్యక్తం చేసింది.

Read More : AP : ‘వైయస్సార్ ఫించన్’ కానుకలో కొత్త నిబంధన, ఏ నెలకానెల ఫించన్ తీసుకోవాలి

ఇందులో మ్యూటేషన్లు జరుగుతున్నాయని, అవి వ్యాక్సిన్లు తట్టుకొనే రీలిలో ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘Mu’ ను శాస్త్రీయంగా B.1.621 పిలుస్తారు. ఈ సంవత్సరం జనవరిలో కొలంబియా దేశంలో ‘Mu’ వేరియంట్ ను గుర్తించారు. తొలుత కొలంబియాలో కనిపించి ‘Mu’ వేరియంట్, అనంతరం దక్షిణ అమెరికా దేశాలతో పాటు..యూరోప్ లోకి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 0.1 శాతం మాత్రమే కేసులున్నట్లు గుర్తించారు.

Read More :22K Gold Vadapav : 22 క్యారెట్ల బంగారంతో చేసిన వడాపావ్..ధర ఎంతంటే..?

అయితే..కొలంబియాలో ఆ కేసుల శాతం 39గా ఉన్నట్లు డబ్ల్యూ హెచ్ వో గుర్తించింది. ప్రస్తుతం నాలుగు వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు..డెల్టా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో వివిధ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. 193 దేశాల్లో అల్పా, 170 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో… ‘Mu’ వేరియంట్ ను కూడా మానిటర్ చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.