AP : ‘వైయస్సార్ ఫించన్’ కానుకలో కొత్త నిబంధన, ఏ నెలకానెల ఫించన్ తీసుకోవాలి

ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది.

AP : ‘వైయస్సార్ ఫించన్’ కానుకలో కొత్త నిబంధన, ఏ నెలకానెల ఫించన్ తీసుకోవాలి

Ysr

YSR Pension Kanuka : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న ‘వైయస్సార్ ఫించన్’ విషయంలో కొత్త నిబంధన జోడించింది సర్కార్. ఇక నుంచి ఏ నెలకానెల ఫించన్ పొందాల్సి ఉంటుందని, రెండు నెలలకొకసారి కలిపి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021, సెప్టెంబర్ నెల నుంచే అమలు చేయాలని, నెలకొకసారి ఫించన్ దారులను తనిఖీ చేయాలని వాలంటీర్లకు సూచించింది. ఫించన్ తీసుకోకపోతే..ఇంక రావు. బకాయిలు కూడా చెల్లించరు.

Read More : 22K Gold Vadapav : 22 క్యారెట్ల బంగారంతో చేసిన వడాపావ్..ధర ఎంతంటే..?

అధికారంలోకి రాకముందు..జగన్..పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. అందులో వైయస్సార్ ఫించన్ పథకం ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత…వృద్ధాద్యపు, వితంతు ఫించన్లను రూ. 2 వేల 250కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే..ఫించన్ విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

Read More : Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర

ఏపీలో ఉండకుండా..పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు..ఫించన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరు మూడు నెలలకొకసారి…వస్తూ..ఒకసారి డబ్బు తీసుకెళుతున్నట్లు తేలింది. అర్హత లేకపోయినా..అక్రమ ఫించన్ పొందుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.

Read More : AP Govt : రేషన్ కార్డు దారులకు బిగ్ రిలీఫ్..ఈ – కేవైసీ గడువు పెంచారు

జూలై, ఆగస్టు నెలల్లో ఫించన్ డబ్బులు తీసుకోని వారికి ఎలాంటి బకాయిలు చెల్లించరని తెలుస్తోంది. కేవలం సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఫించన్ ఇవ్వనున్నారని సమాచారం. అర్హులైన ఫించన్ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది.