Petrol Price : విమానాల ఇంధనమే చీప్‌..విమానాలకు రూ.79.. బైకు, కార్లకు రూ.113 పైనే..!!

విమానాల ఇంధనమే చీప్‌ గా ఉంది బైకు, కార్ల పెట్రోల్ ధరల కంటే.. బైకులకు రూ.113 పైనే పెట్రోట్ ధర ఉంటే..విమానాల ఇంధనం ధర లీటరు రూ.79 గా ఉంది.

Petrol Price

Aviation Turbo Petrol Is Cheaper Than Regular Petrol ; కారే కాదు బైక్ బయటకు తీయాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక కారు బయటకు తీస్తే చెప్పనే అక్కర్లేదు. జేబులు కాదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. పెట్రోల్ బంక్ కు వెళితే మీటర్ తిరుగుతుంటే హార్ట్ బీట్ మోటర్ కంటే ఫాస్టుగా కొట్టుకుంటోంది. ఎందుకంటే గుండె పైనున్న జేబులే కాదు  మొత్తం నిలువు దోపిడీ అయిపోతోంది  రోజుకో రకంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు.  కానీ ఇక్కడ గమనించాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే..రోడ్లమీద తిరిగే బైకులు, కార్ల పెట్రోల్ కంటే గాల్లో ఎగిరే ‘‘విమానాల ఇంధనమే చీప్’’ గా ఉంది. ఈ విషం మీకు తెలుసా? బైకు కార్లకంటే విమానం బెటర్ భయ్యా??అంటూ మన క్రియేటర్స్ మీమ్స్ చూస్తుంటే నిజమే భయ్యో..బైకులు, కార్లు పక్కన పెట్టేసి ఆస్తులు అమ్మేసైనా ఓ విమానం కొని పడేసుకుంటే పోలా? అనిపిస్తోంది. కానీ చెప్పుకోవటానికి ఇదంతా బాగానే ఉంటుంది కానీ ఎక్కడ సాధ్యం? అందుకే జేబులు..బ్యాంక్ ఎకౌంట్లు కూడా ఖాళీ అవుతున్నా బైకులు,కార్లు బయటకు తీయకా తప్పటంలేదు..ఎవరి పనులు వారు చేసుకోకా మానటంలేదు. మరో పక్క ఎవరు ఎలాగున్నా మేం మాత్రం తగ్గేదేలేదు అన్నట్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతునే ఉన్నాయి. హా ఇంతకీ కార్లు, బైకుల పెట్రోల్ ధర కంటే విమానం ఇంధనం ధర ఎందుకు తక్కువా? అనే విషయం తెలుసుకుందాం..

Read more : Petrol Price: రూ.120కి చేరుకున్న పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో తెలుసా?

బైకు, కార్ల పెట్రోల్ ధర లీటరు రూ.110కు చేరుకోగా అదే విమానం ఇంధనం మాత్ర కేవలం రూ..79 మహా అయితే రూ.80గా ఉంది. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. బైకు సామాన్యుడి వాహనం. కాస్త మెరుగైన ఆర్ధిక పరిస్థితి ఉంటే కారు ఇవే సర్వాసాధారణంగా ఉండే వాహనాలు. కానీ వాటికి కూడా ఇంధనం పోయించే పరిస్థితి లేదిప్పుడు. పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్‌ టర్బో ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయానికి వస్తే రెగ్యులర్‌ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే ఇంధనం లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.

Read more : Mustard plant Aviation Fuel : ఆవాలతో విమానం ఇంధనం తయారీ..భారతీయ శాస్త్రవేత్త పరిశోధనలో వెల్లడి

మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే జరుగుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌ కలుపుతారు. ఆ ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. ఆ తరువాత రాష్ట్రాల వడ్డింపులు ఉండనే ఉన్నాయి. కేంద్రం విధించగా దానిపై కూడా రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. వెరసి ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కోరకంగా ఉంటుందన్నాయి. దీంట్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా గుజరాత్‌ రాష్ట్రం 30 శాతం వ్యాట్‌ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్‌. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్‌ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్‌ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది.

ఇక రెగ్యులర్‌ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపిన ధరలపై ఆయా రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను విధిస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్‌, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్‌ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్‌ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్‌ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది.

Read more : Russia-Covid 19: రష్యాని హడలెత్తిస్తున్న కరోనా..ఒక్క రోజులో 41,000 కేసులు
అంతర్జాతీయ ధరలంటూ సాకులు చెబుతున్న వైనం
ఈ పన్నుల భారం సామాన్యుడిపై పెను భాగంగా మారుతున్నాయి. సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తు ఈ తప్పు మాదికాదు అన్నట్లుగా మిన్నకుండిపోతున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా నెపం అంతర్జాతీయంపై తోసేస్తున్నాయి. రోజు మారితే సామాన్యుడి గుండెలు గుభేలు మంటున్నాయి. ఈరోజు పెట్రోలు ఎంత పెరిగిందోననే ఆలోచనతో. ఈ ధరాఘాతాలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా సెంచరీ ఎప్పుడు దాటేసింది. రూ.113కి చేరుకుంది. రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది. ఇలా ఎవరు దోచుకుంటున్నా బలయ్యేది మాత్రం సామాన్యుడే. ఏ ధరలు పెరిగితే మిన్నకుండి భారాలు మోసేది సామన్యుడే. కానీ అదే సామాన్యుడు కట్టే పన్నులతోనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నడిచేది.కానీ సామాన్యుడి కష్టాలుమాత్రం వారి పట్టనే పట్టవు.