Russia-Covid 19: రష్యాను హడలెత్తిస్తున్న కరోనా..ఒక్క రోజులో 41,000 కేసులు

రష్యాని కరోనా మహమ్మారి గడగడలాడించేస్తోంది. ఒక్కరోజులోనే 40,096 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా..1,159 మంది ప్రాణాలు కోల్పోయారు.

Russia-Covid 19: రష్యాను హడలెత్తిస్తున్న కరోనా..ఒక్క రోజులో 41,000 కేసులు

Russia Covid 19 (1)

Russia-Covid 19:  రష్యాని కరోనా మహమ్మారి గడగడలాడించేస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న హడలెత్తిస్తున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించి అమలు జరుపుతున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో గురువారం (అక్టోబర్ 28,2021) ఒక్కరోజే 40,096 పాజిటివ్‌ కేసులు నమోదుఅయ్యాయి. ఈ మహమ్మారికి 1,159 మంది బలయ్యారు. రష్యా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు..మరణాలు సంభవించటంతో ఇవే అత్యధికం అని అధికారులు చెబుతున్నారు. వైరస్‌ ఉధృతి పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రజలపై ఆంక్షలు విధిస్తోంది. ఎంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరు బయటకు రావద్దని ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. కరోనాను నియంత్రించటంలో ప్రజలు సహకరించాలనే లేదంటే వ్యాప్తి పెరిగుతోందని ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తోంది.

Read more : Lockdown In Russia : రష్యాలో మళ్లీ కఠిన లాక్ డౌన్

దీంట్లో భాగంగా..రష్యా రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్‌ వర్కింగ్‌ పీరియడ్‌ అంటే అత్యవసర డ్యూటీలో ఉన్న ఉద్యోగులు మినహా ఇతర ఉద్యోగులు ఎవరూ డ్యూటీలకు వెళ్లరాదని వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రయారిటీ ఇవ్వాలని సూచనలు జారీ అయ్యాయి. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనాల్లో మాత్రం ఏమాత్రం భయం కలగటంలేదు. బాధ్యతగా ఉండాలనే ఆలోచనలు కలగటంలేదు.

దీంతో జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా కేవలం 4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. రష్యాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. అలాగే కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో కరోనా విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read more : Russia : రష్యాలో వరుసగా మూడో రోజు కోవిడ్ విజృంభణ..ఒక్కరోజే వెయ్యికి పైగా మరణాలు