Lockdown In Russia : రష్యాలో మళ్లీ కఠిన లాక్ డౌన్

రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం, కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రష్యాలో గురువారం

Lockdown In Russia : రష్యాలో మళ్లీ కఠిన లాక్ డౌన్

Russia

Lockdown In Russia  రష్యాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం, కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రష్యాలో గురువారం 36,339 కోవిడ్ పాజిటివ్ కేసులు, 1,036 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో యూరప్ లోనే అత్యధికంగా రష్యాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2,27,389కి చేరింది.

అయితే కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో కోవిడ్ ఉదృతిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు(అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు) ఉద్యోగులకు పెయిడ్ సెలవులు ఇవ్వనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ ప్రకటించిన మరుసటి రోజే మాస్కో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కోవిడ్ ఎపిక్ సెంటర్ గా ఉన్న రాజధాని మాస్కోలో అక్టోబర్-28 నుంచి నవంబర్-7 వరకు 11 రోజుల పాటు కఠిన లాక్​డౌన్ అమలు చేయనున్నట్లు గురువారం మాస్కో మేయర్ సెర్జీ సొబయానిన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో అన్ని కార్యకలాపాలు బంద్ అవుతాయి అని మేయర్ ప్రకటించారు. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ఇంకోక మార్గం లేదని ఆయన అన్నారు. తాజా ఉత్తర్వులతో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, క్రీడా విభాగాలు, సాంస్కృతిక కేంద్రాలలో ఎలాంటి కార్యకలాపాలు ఉండరాదు. అన్ని కార్యక్రమాలను నిషేధించారు. మాస్కో లోని అన్ని అధికార కార్యాలయాలు మూతపడనున్నట్లు మేయర్ తెలిపారు.

అయితే రెస్టారెంట్లు, కేఫ్‌లు పార్శిల్ సర్వీసులను కొనసాగించవచ్చని.. మెడికల్ షాపులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు లాక్ డౌన్ కాలంలో తెరిచి ఉంటాయని షాపులు కూడా తెరిచి ఉంటాయని మేయర్ ప్రకటించారు. మ్యూజియంలు, ఆర్ట్ థియేటర్లు కూడా తెరిచి ఉంటాయని..అయితే టీకాలు వేసుకున్న వారికే వాటిలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు.

మాస్కో నగరంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని మేయర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా పరిస్థితులు ప్రమాద కరంగా మారాయని తెలిపారు. నవంబర్ 8 న ఆంక్షలు ముగిసిన తర్వాత మాస్కోలో.. 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఉచిత ప్రజా రవాణా పాస్‌లను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వైరస్ ప్రమాదాన్ని అధికంగా కలిగి ఉండే ముస్కోవైట్‌ల జీవితాలను మరియు ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు మేయర్ తెలిపారు.

ASLO READ Coronavirus: డెల్టా కంటే ప్రమాదకరమైన సబ్-వేరియంట్.. పెరిగిన వైరస్ వేగం!!