షాకిచ్చిన లండన్ కోర్టు : అసాంజేకు 50 వారాల జైలుశిక్ష

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు లండన్ కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది.

  • Publish Date - May 1, 2019 / 01:11 PM IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు లండన్ కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది.

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు లండన్ కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. ఏడేళ్ల క్రితం బ్రిటన్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో కోర్టు బుధవారం (మే 1, 2019) రోజున అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అసాంజే అప్పగింత కేసులో యూఎస్ వేసిన పిటిషన్ పై గురువారం (మే 2, 2019)న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు విచారణకు ఒకరోజు ముందే లండన్ కోర్టు బెయిల్ నిబంధనలు ఉల్లంఘన కేసులో అసాంజేకు 50వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

2012లో బెయిల్ నిబంధనలను అతిక్రమించి లండన్ లోని ఈక్వేడార్ ఎంబాసీలో జులియన్ అసాంజే రాజకీయ ఆశ్రయాన్ని పొందారు. అంతర్జాతీయ పద్ధతులను పలుమార్లు ఉల్లంఘించడంతో ఈక్వేడార్ ఎంబాసీ.. అసాంజేకు ఇచ్చిన రాజకీయ ఆశ్రయాన్ని ఉపసహరించుకుంది. దీంతో అసాంజే (47)ను గురువారం (ఏప్రిల్ 11, 2019) బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : వికీలీక్స్.. జులియన్ అసాంజే అరెస్ట్ అయ్యాడు

మరోవైపు లైంగిక ఆరోపణల కేసులో స్వీడెన్ బహిష్కరణ నుంచి తప్పించుకునేందుకు 2012లో బెయిల్ నిబంధనలను అసాంజే అతిక్రమించాడు. ఈ కేసు విషయంలో అసాంజే  గైర్హాజరు కారణంగా 2017లో కేసును మూసివేశారు. అసాంజే అరెస్ట్ తో యూఎస్ జస్టీస్ డిపార్ట్ మెంట్ అసాంజేపై అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు ఓ పిటిషన్ దాఖలు చేసింది.

రక్షణ శాఖ కంప్యూటర్ల హ్యాకింగ్ కుట్రతో సంబంధం ఉందనే ఆరోపణలతో అసాంజేను తమ దేశానికి తిరిగి అప్పగించేందుకు అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలైంది. మిలటరీ అండ్ డిప్లొమాటిక్ డాక్యుమెంట్లు, యూఎస్ వార్స్, ఇరాక్, అఫ్ఘనిస్థాన్ కు సంబంధించిన పలు విలువైన సమాచారాన్ని వికీలీక్స్ 2010లో రిలీజ్ చేసింది. 
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!