వికీలీక్స్.. జులియన్ అసాంజే అరెస్ట్ అయ్యాడు

ప్రపంచంలోని అవినీతిపరులకు ముచ్చెమటలు పట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే (47)ను గురువారం (ఏప్రిల్ 11, 2019) బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 10:34 AM IST
వికీలీక్స్.. జులియన్ అసాంజే అరెస్ట్ అయ్యాడు

Updated On : April 11, 2019 / 10:34 AM IST

ప్రపంచంలోని అవినీతిపరులకు ముచ్చెమటలు పట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే (47)ను గురువారం (ఏప్రిల్ 11, 2019) బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రపంచంలోని అవినీతిపరులకు ముచ్చెమటలు పట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే (47)ను గురువారం (ఏప్రిల్ 11, 2019) బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసాంజేను అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ఎంబాసీ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బ్రిటన్ పోలీసులను ఎంబాసీలోకి ఆహ్వానించారు. 2012 నుంచి ఈక్వెడార్ రాయబారం కార్యాలయంలోనే అసాంజే ఆశ్రయం పొందుతున్నారు.

ఈ క్రమంలో మెట్రోపాలిటిన్ పోలీస్ సర్వీసు (MPS) అధికారులు ఈక్వేడార్ ఎంబాసీలో అసాంజేను అదుపులోకి తీసుకున్నారు.  INA పేపర్స్ లీక్ చేసి ఆఫ్షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాడనే కారణంతో అసాంజే రాజకీయ ఆశ్రయాన్ని ఈక్వెడార్ అక్రమంగా రద్దు చేసిందని వికీలీక్స్ ఆరోపించింది. అంతర్జాతీయ చట్టంలోని ఆశ్రయ నిబంధనలను వరుసగా అసాంజే ఉల్లంఘించాడంతో ఈక్వెడార్ దౌత్యపరమైన ఆశ్రయాన్ని విత్ డ్రా చేసుకున్నట్టు అధ్యక్షుడు లెనిన్ మొరానో చెప్పారు.

అసాంజేను అప్పగించే విషయంలో ఈక్వెడార్ కు యూకే హామీ ఇచ్చినట్టు మొరానో తెలిపారు. అసాంజేపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై కోర్టులే నిర్ణయిస్తాయని జూనియర్ విదేశీ కార్యాలయ అధికారి తెలిపారు. రానున్న ఏళ్లలో యూకే, ఈక్వెడార్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆయన తెలిపారు.