American Women : ఏడ్చినందుకు బిల్ వేసిన ఆసుపత్రి సిబ్బంది

సర్జరీ చేస్తున్న సమయంలో...మిడ్గే ఏడ్చేసింది. వైద్యులు ఆమెకు ధైర్యం చెప్పి శస్త్రచికిత్స చేశారు. డిశ్చార్జ్ చేసే ముందు ఆసుపత్రి సిబ్బంది బిల్లు చేతిలో పెట్టారు.

American Women : ఏడ్చినందుకు బిల్ వేసిన ఆసుపత్రి సిబ్బంది

America

Updated On : September 30, 2021 / 11:25 AM IST

Mole removal Crying : ఆపరేషన్ చేసే సమయంలో ఏడ్చినందుకు బిల్ వేశారు. ఆసుపత్రి యాజమాన్యం. బిల్ చూసిన ఆ పేషెంట్ షాక్ తిన్నారు. దీనిన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏంటీ ? ఏమోషనల్ కు కూడా బిల్ ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి హెల్త్ పరిస్థితి ఆ విధంగా ఉంది…అసలే కరోనాతో ఇబ్బందులు పడుతుంటే..ఇలాంటి బిల్లులు వేస్తే…ఇక పని అయిపోయినట్లేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

Read More : Amarinder Singh : G-23 కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న కెప్టెన్ సాబ్.. అందుకేనా?

మిడ్డే అనే మహిళ పుట్టుమచ్చలు తొలగించుకొనేందుకు ఓ ఆసుపత్రికి వెళ్లింది. సర్జరీ చేస్తున్న సమయంలో…మిడ్గే ఏడ్చేసింది. వైద్యులు ఆమెకు ధైర్యం చెప్పి శస్త్రచికిత్స చేశారు. డిశ్చార్జ్ చేసే ముందు ఆసుపత్రి సిబ్బంది బిల్లు చేతిలో పెట్టారు. బిల్లులో రూ. 223 డాలర్లు అని ఉంది. అయితే..బిల్లులో వేటికి ఛార్జ్ చూశారో పరిశీలించారు మిడ్గే. సర్జరీకి ముందు ఏడ్చినందుకు (Brief Emotion) 11 డాలర్లు అని ఉంది.

Read More : Bananas Flour : అరటితో అద్భుతాలు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు

ఏడ్చినందుకు బిల్ ఏంటీ ? అంటూ తెల్లమొహం వేశారు. ఆసుపత్రి వేసిన ఈ బిల్లు గురించి..ప్రపంచాన్ని తెలియచెప్పాలని అనుకున్నారు. వెంటనే బిల్లుకు సంబంధించిన ఫొటో తీసి..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కాస్తా..సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పది లక్షలకు పైగా లైక్ లు రాగా…వేల సంఖ్యలో రీ ట్వీట్ చేశారు. కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.