Dominos Interview: ఇంటర్వ్యూలో ఏజ్ అడిగడంపై మహిళ అభ్యంతరం.. 4లక్షల పరిహారం
తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను. కానీ డోమినోస్ ప్రకటనలో అలా లేదు’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్‌గా ముందుకు వెళ్లడంతో డోమినోస్ యాజమాన్యం 4 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు.

Woman Gets Rs4 Lakh Compensation After Her Age Was Asked in Job Interview
Dominos Interview: ఒక ఇంటర్వ్యూలో వయసు, లింగం ద్వారా వివక్షకు గురయ్యానని ఐర్లాండ్‌కు చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా డోమినోస్ యాజమాన్యాన్ని సంప్రదించడంతో పాటు లీగల్‌గా ముందుకు వెళ్లడంతో ఇంటర్వ్యూ ప్యానెల్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే కాకుండా 4 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించింది. తాజాగా, ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించింది.
డోమినోస్ పిజ్జా ఇంటర్వ్యూకి వెళ్లగానే తన వయసు గురించి మొదటి ప్రశ్న అడిగారని ఆ మహిళ వెల్లడించింది. తన వయసు చెప్పగానే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. నువ్వు అలా కనిపించడం లేదంటూ గోల చేశాడని ఆమె పేర్కొంది. తన వయసు, లింగం కారణంగా తాను ఉద్యోగానికి అర్హత కోల్పోయానని తాను గుర్తించింది. అనంతరం ఫేస్బుక్ ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని డోమినోస్ యాజమాన్యంతో పంచుకుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల నుంచి ఆమెకు క్షమాపణలు అందాయి. ఇంటర్వ్యూలో వయసుకు సంబంధించిన అంశాలు అడగడం పట్ల ప్యానెల్ అప్రమత్తంగా ఉండాలని డోమినోస్ హెచ్చరించింది.
అనంతరం, తాను డ్రైవర్ పోస్టుకు అప్లై చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘డ్రైవర్లుగా మగవారు మాత్రమే ఉండడాన్ని నేను గమనించారు. కానీ నేను మహిళ కావడం వల్ల ఆ ఉద్యోగం పొందలేకపోయాను’’ అని పేర్కొంది. ఈ విషయమై ఆమె లీగల్‌గా ముందుకు వెళ్లడంతో డోమినోస్ యాజమాన్యం 4 లక్షల రూపాయల పరిహారం చెల్లించారు.