woman post went viral
woman post went viral : ఒక కుటుంబంలో మొదట పుట్టినవారికి ప్రత్యేక స్ధానం ఉంటుంది. ఇక వారికి చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. ఈజుల్లో తన తోబుట్టువుల పట్ల ఎవరు బాధ్యతగా మెలుగుతున్నారు? అనుకుంటే పొరపాటే.. ఓ మహిళ తన ఫ్యామిలీలో పెద్దకూతురిగా ఉండి ఎదుర్కున్న పోరాటాల్ని భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫ్యామిలీలో నేను పెద్దకొడుకుని.. పెద్ద కూతుర్ని అనుకుంటే సరిపోదు కదా.. తన తరువాత పుట్టిన వారికి వాళ్లు ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే ముందు పుట్టినవారిని తరువాత వారు ఫాలో అవుతారు. ఓ మహిళ తన కుటుంబంలో పెద్ద కూతురిగా ఉంటూ ఆమె ఎలాంటి సంతోషాల్ని, బాధ్యతల్ని పంచుకుంటోందో చెబుతూ చేసిన పోస్ట్ ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ‘ఇంట్లో పెద్ద కూతురిగా పుట్టడం వల్ల అందర్నీ జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యతగా భావిస్తాను.. వాళ్లకి టీ, స్నాక్స్, భోజనాలు సమకూర్చడం దగ్గర్నుంచి అతిథులు వస్తే మర్యాద చేయడం.. ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు పట్టించుకోవడం నా పనిగా అనుకుంటాను. ఇంట్లో ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు తెలుసుకుంటూ.. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినా అది కూడా నా వల్ల జరిగిందనే భావిస్తాను. ఇంట్లో, ఆఫీస్‌లో , ఆర్ధిక వ్యవహారాల్లో సహాయ, సహకారాలు అందిస్తాను.. నా తరువాత పుట్టిన తోబుట్టువులను సరైన మార్గంలో నడిపిస్తాను’ అంటూ డైటీ అనే యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్ట్ అందరి మనసుల్ని కదిలించింది.
Rajasthan : మొసలితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడుకున్న మహిళ .. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు
ఫ్యామిలీలో మొదటగా పుట్టిన అనేకమంది ఈ పోస్టుపై స్పందించారు. ఆమె తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు మరింత శక్తినివ్వాలని కొందరు.. ఇప్పటికీ తాను కూడా తన కుటుంబం గురించి వర్రీ అవుతుంటానని కొందరు సమాధానం చెప్పారు. బాధ్యతలు పంచుకోవడంలో ఆడైనా, మగైనా ఒకటే. తల్లిదండ్రుల పట్ల, తోడబుట్టిన వారి పట్ల ప్రేమాభిమానాలతో మెలగడమే కాదు.. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ తోబుట్టువుల పట్ల బాధ్యతగా మెలగడం. నేటి సమాజంలో నిజంగా ఇది కరువైంది. ఇలాంటి పోస్టుల ద్వారా అయినా చాలామందిలో మార్పు కలుగుతుందని ఆశిద్దాం.
As the eldest daughter I feel like it is my responsibility to take care of everyone and everything. From making everyone at home eat their meals, making tea and snacks for guests, handling every crisis with a calm mind, taking care of everyone’s emotions, understanding everyone,
— Deity (@gharkakabutar) April 18, 2023