cancer survivor : క్యాన్సర్ జయించిన మహిళకు ఘన స్వాగతం పలికిన ఇరుగుపొరుగువారు.. కన్నీరు పెట్టించే వీడియో..
క్యాన్సర్‌ని జయించడమంటే పునర్జన్మే. కైలీ అనే మహిళ క్యాన్సర్‌తో పోరాడి తిరిగి ఇంటికి వచ్చింది. ఇరుగుపొరుగువారు ఆమెకు ఎలా స్వాగతం పలికారో చూస్తే మనసును కదిలిస్తుంది.

cancer survivor
cancer survivor : ఇంట్లో వాళ్ల సమస్యల్నే పట్టించుకునే టైం లేదు.. ఇరుగుపొరుగువారి సమస్యలు వినేంత టైం ఎక్కడిది అంటారా? క్యాన్సర్‌తో పోరాడి జయించి వచ్చిన మహిళకు ఇరుగుపొరుగు వారు (neighbours) ఎలాంటి స్వాగతం చెప్పారో చూస్తే కన్నీరు తెప్పిస్తుంది.
Cancer Heart Disease Vaccines : క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!
కరోనా ముందు.. కరోనా తర్వాత మనుష్యుల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. ఎవరికి ఏమైంతే నాకేంటి? అనే పరిస్థితుల నుంచి కాస్త పక్కన ఉన్నవాళ్లను పట్టించుకునేలా చేసింది కరోనా. కరోనా కష్టాలు తల్చుకుంటే ప్రతి ఇంటికి ఓ కథ ఉంటుంది. ఇక విషయానికి వస్తే క్యాన్సర్‌ని (cancer) జయించి తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చిన కైలీ (kylee)అనే మహిళకు ఇరుగుపొరుగువారు ఘన స్వాగతం పలికారు. ఆమెను విష్ చేస్తూ సైన్ బోర్డులు, బెలూన్లు, రిబ్బన్లతో ఆమె నివాసం ఉండే ప్రాంతంలో నిలబడి ఆనందంతో ఆహ్వానించారు. ఈ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేరై ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది.
గుండెపోటు, క్యాన్సర్ కణాలతో పోరాడే మామిడి పండు
క్యాన్సర్‌ని ఓడించి ఆమె మరింత అందంగా ఉందని ..ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కొందరు.. ఆమె ఆత్మవిశ్వాసమే క్యాన్సర్ ని జయించేలా చేసిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. కైలీ కోసం వీధి వీధంతా వచ్చి స్వాగతం పలికారంటే ఆమె తన ప్రాంతం వారిపట్ల ఎంత ఆప్యాయంగా మెలిగేదో కూడా అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి కైలీ కథ అందరిలో స్ఫూర్తి నింపుతోంది.
View this post on Instagram