Viral Video (2)
Viral Video : వెయిట్ చేయడమంటే చాలామందికి చిరాకు.. ఏదైనా సరే అనుకున్న వెంటనే జరిగిపోవాలి అనుకుంటారు కొందరు. ఆలా కాకపోతే అసహనం వ్యక్తం చేస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి లక్షణాలు మనం ఇంట్లో చిన్న పిల్లలో ఎక్కువగా చూస్తుంటాం. వారు అనుకున్నది ఇవ్వకపోతే ఏది దొరికితే దాని విసిరేస్తుంటారు. అయితే తాజాగా ఓ మహిళ ఇదే పని చేసింది. మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లిన మహిళ కాఫీ ఆర్డర్ చేసింది. అయితే కాఫీ తయారీకి సమయం పడుతోందని 5 నిమిషాలు వెయిట్ చెయ్యాలని సిబ్బంది కోరారు.
Read More : Viral Video: మటన్ కర్రీ చేస్తున్న భార్య..రొమాంటిక్ భర్త కొంటె పని
దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. అక్కడ ఉన్న ప్లేట్లు కింద పడేసింది. ఆమె చేసిన పనిని చూసి సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. కాగా ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అర్కాన్సాస్‌లో ఓ మహిళ మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసింది. అదే సమయంలో సిబ్బందికి వేరే ఆర్డర్ రావడంతో బిజీగా ఉండి.. కాఫీకి ఐదు నిమిషాల సమయం పడుతుందని తెలిపారు. కాఫీ కోసం అయిదు నిమిషాలు ఆగాలా అని అసహనానికి గురైన మహిళ షాప్‌లో బీభత్సం సృష్టించింది.
Read More : Viral Video : ఎవరు నేర్పారమ్మా చింపాజీ..ఇంత బాగా బట్టలు ఉతకడం..
అక్కడ ఉన్న టేబుల్ నంబర్లు, సర్వింగ్ ప్లేట్లను కిందపడేసింది. సిబ్బందిని దూషిస్తూ సీటు దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ కౌంటర్ వద్దకు వచ్చి వారితో గొడవకు దిగింది. ఇక ఈ దృశ్యాలను సిబ్బందిలో ఒకరు తమ కెమెరాల్లో బంధించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ ప్రవర్తనపై మెక్‌డొనాల్డ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మహిళ తనకు డయాబెటిస్ ఉందని, లో బ్లడ్ షుగర్ వల్ల ఇలా ప్రవర్తించానని తెలిపింది.
Karen Trashes McDonald’s because Her Coffee Took too Long pic.twitter.com/qi0V0MG2mk
— Karen (@crazykarens) October 4, 2021