Viral Video : ఎవరు నేర్పారమ్మా చింపాజీ..ఇంత బాగా బట్టలు ఉతకడం..

అత్యంత తెలివైన జంతువుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు మనుషులవలె ప్రవర్తిస్తుంటాయి.

Viral Video : ఎవరు నేర్పారమ్మా చింపాజీ..ఇంత బాగా బట్టలు ఉతకడం..

Viral Video

Viral Video : అత్యంత తెలివైన జంతువుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు మనుషులవలె ప్రవర్తిస్తుంటాయి. మనుషుల జన్యుక్రమంపై అధ్యయనం చేసిన అనేక మంది పరిశోధకులు మనుషులు చింపాంజీల నుంచే వచ్చారని తెలిపారు. అందుకే చింపాంజీల్లో కూడా మనిషి లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి మనుషులు చేసినట్లే పనులు చేస్తుంటాయి. ఏదైనా పనిని ఒకసారి చూస్తే ఆ పనిని యిట్టె చేసేస్తుంటాయి. ఇక మనుషులతో అత్యంత ప్రేమగా మెలిగే జంతువుల్లో చింపాంజీ ఒకటి. కొన్ని సార్లు ఇవి చేసే పనులు ఆశ్చర్యపరుస్తాయి. అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ దృష్టిని తమవైపు తిప్పుకుంటాయి.

ఇక తాజాగా ఓ చింపాంజీ బట్టలు ఉతుకుతు కనిపించింది. దానిని చూసిన కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం చింపాంజీ బట్టలు ఉతికే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పచ్చ రంగు టీ షర్ట్ ను బండపై వేసి..ఆచం మనిషిలాగే ఉతికింది.. దానికి సబ్బుకూడా పెట్టింది. అనంతరం బ్రష్ తో దాన్ని శుభ్రం చేసింది. ఇక చింపాంజీ బట్టలు ఉతకడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. మనుషుల వలే ఉతుకుతుందంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ వీడియో చూసినవారిలో కొందరు నవ్వే ఇమేజెస్ పెట్టగా, మరికొందరు ఫైర్ సింబల్ పోస్టు చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.