ఎమర్జెన్సీ డోర్ తెరిచి..విమానం రెక్కపై వాకింగ్ చేసిన మహిళ..

  • Published By: nagamani ,Published On : September 2, 2020 / 12:02 PM IST
ఎమర్జెన్సీ డోర్ తెరిచి..విమానం రెక్కపై వాకింగ్ చేసిన మహిళ..

Updated On : September 2, 2020 / 12:46 PM IST

ఎమర్జెన్సీ డోర్ తెరిచి..విమానం రెక్కపై వాకింగ్ చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా మానం బస్సులోనో, రైల్లోనో ప్రయాణించేటప్పుడు గాలి ఆడకపోతే.. కాసేపు కిందకి దిగి అటూ ఇటూ తిరుగుతాం. లేదా విండో డోర్ తెరుచుకుని ఊపిరి పీల్చుకుంటాం. కానీ విమానంలో అటువంటి అవకాశం ఉండదు. కానీ ఓమహిళ మాత్రం ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని విమానం రెక్క మీదక వచ్చేసి అటు ఇటూ తిరిగింది. అదేంటీ అంటే గాలి ఆడట్లేదు అందుకే ఇలా వచ్చానంటూ కహానీలు చెప్పింది. ఈ ఘటన ఉక్రేయిన్‌లోని కైవ్‌లో జరిగింది. కాకపోతే అప్పటికే విమానం ల్యాండ్ అయి ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు.



వివరాల్లోకి వెళితే..ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి టర్కీలో హాలీడేస్ ఎంజాయ్ చేసి బోయింగ్737-86N విమానంలో తిరుగి వస్తోంది. దారిలో ఆ విమానం కైవ్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో ఆమె విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్క మీద అటూ ఇటూ నడిచింది. అక్కడే కాసేపు కుర్చుందికూడా. అది చూసిన విమానం సిబ్బంది అదేంటీ అలా..అని ప్రశ్నించారు. దీనికామె గాలి ఆడట్లేదు అందుకే ఇలా వాకింగ్ అంటూ కథలు చెప్పింది. కానీ..అప్పటికే ఆమె ఇద్దరు పిల్లలు విమానం దిగిపోయారు. విమానం రెక్కపై ఉన్న ఆమెను అంతా విచిత్రంగా చూశారు. ఆమె మా అమ్మ అని పిల్లలు చెప్పారు.మా అమ్మ అక్కడికి ఎందుకు వెళ్లిందో తెలీదని తెలిపారు.
https://10tv.in/indian-idol-singer-renu-nagar-critical-after-boyfriend-dies-by-suicide/
దయచేసి లోపలికి రండీ మాడమ్ అని విమానం సిబ్బంది అని అడగ్గా..దీంతో ఆమె మళ్లీ ఎమర్జీన్సీ డోర్ నుంచే లోపలికి వచ్చింది..అప్పటికే విమానం మొత్తం ఖాళీ అయ్యింది. విమానంలో పిల్లలను వదిలేసి.. రెక్కలు మీదకు ఎందుకు వెళ్లావని పైలట్ విసుగ్గా..చిరాగ్గా..ఆగ్రహంగా ప్రశ్నించగా.. విమానంలో గాలి ఆడటం లేదు..కాసేపు అలా..గాలి పీల్చుకుందామని రెక్కల మీదకు వెళ్లానని సమాధానం చెప్పింది.



దీంతో.. పైలట్ కు ఆమె మానసిక పరిస్థితి బాగాలేదేమోనని..లేదా మద్యం తాగి ఉందేమోననే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వచ్చిన పోలీసులు అంబులెన్సుతో సహా వచ్చి ఆమెను డాక్టర్లతో వైద్య పరీక్షలకు తరలించారు. కానీ.. ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని, డ్రగ్స్, మద్యం లాంటివి కూడా తీసుకోలేదని చెప్పారు. విమానం ల్యాండైన తర్వాత కిందకు దిగి గాలి పీల్చుకోవచ్చు..కానీ అలాకాకుండా ఎమర్జీన్సీ డోర్ నుంచి రెక్కమీదకు ఎందుకు వెళ్లింది అనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు.