Divorcing Herself: తనను తానే పెళ్లి చేసుకుని మూడు నెలలకే విడాకులు తీసుకున్న మహిళ

ఇదే సంవత్సరం తనను తానే వివాహం చేసుకున్న మహిళ.. మరొకరు కలిశారంటూ మూడు నెలలకే విడాకులు తీసుకుంది. మగాళ్లలో తనకు సరైన తోడు దొరకలేదంటూ క్రిస్ గలేరా సెప్టెంబరులో స్వీయ వివాహానికి .....

Divorcing Herself: తనను తానే పెళ్లి చేసుకుని మూడు నెలలకే విడాకులు తీసుకున్న మహిళ

Cris Galera

Updated On : November 23, 2021 / 4:00 PM IST

Divorcing Herself: ఇదే సంవత్సరం తనను తానే వివాహం చేసుకున్న మహిళ.. మరొకరు కలిశారంటూ మూడు నెలలకే విడాకులు తీసుకుంది. మగాళ్లలో తనకు సరైన తోడు దొరకలేదంటూ క్రిస్ గలేరా సెప్టెంబరులో స్వీయ వివాహానికి పూనుకుని ఆ నిర్ణయం సరికాదని వెనక్కి తగ్గింది. 31ఏళ్ల ఈ మోడల్ ముందేమో పెళ్లి కొడుకు లేడని నిరుత్సాహపడకుండా తంతు పూర్తి చేసుకుంది.

కాకపోతే 90రోజులుగా భార్యలా మేనేజ్ చేసింది కానీ, తనకు తాను భర్త కాలేకపోయింది. బ్రెజిల్ లో సావో పౌలో అనే వ్యక్తిని కలిశాక నిర్ణయం మార్చేసుకుంది.

‘అతణ్ని కలిసిన తర్వాత హ్యాపీగా ఫీలయ్యా. అప్పుడే నాకు ప్రమే మీద నమ్మకం పెరిగింది. నాకు తెలిసొచ్చింది. నేను శక్తివంవతమైన మహిళ అని తెలుసు. కాకపోతే ఒంటరిగా ఉండాలంటే ఎప్పుడూ భయం వేసేది. నాగురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. ఇప్పుడు దానిని సెలబ్రేట్ చేసుకుంటున్నా’ అని చెప్పింది.

……………………………. : కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

 

ఆమె పెళ్లి రోజు సందర్భంగా క్రిస్ ఇచ్చిన ఫోజులతో జరిగిన ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ అయింది.