Women ఫైట్.. టాయిలెట్ పేపర్ల కోసం కోర్టుకెక్కారు!

అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
కరోనా ఎఫెక్ట్‌తో టిష్యూ, టాయిలెట్ పేపర్లు పంపే చైనా.. ఒక్కసారిగా పంపడం ఆపేసింది. దీంతో వినియోగదారుల్లో భయం మొదలైంది. చాలా షాపుల్లో దొరకకపోతుండటంతో కనిపించిన ప్రతి చోటా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ షాపింగ్ మాల్లో యువతి ట్రాలీ నిండా… టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుని కొనుగోలు చేయాలనుకుంది.
ఇంతలో 60 ఏళ్ల మహిళ తనకు ఓ ప్యాకెట్ కావాలని అడిగింది. దానికి నిరాకరించిన యువతి ముందు నేనే తీసుకున్నాను. ఆ మొత్తం నాకే కావాలి అంది. షాప్ రూల్స్ ప్రకారం.. మనిషికి ఒక ప్యాకెట్టే అమ్ముతారు ఆ విషయం చెప్పి కచ్చితంగా తనకు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడిగింది. తిట్లు మితిమీరి కొట్టుకునేదాకా వెళ్లింది.
All because of toilet paper ??♂️??♂️ pic.twitter.com/XGtLeXrKJ5
— Bold_Westie (@_West_Sydney_) March 6, 2020
ఆ యువతికి సపోర్ట్‌గా మరో మహిళ రావడంతో 60ఏళ్ల మహిళ వెనక్కి తగ్గింది. కానీ, గొడవను ఆపేందుకు వచ్చిన షాప్ కీపర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరిపై కేసు పెట్టిన పోలీసులు విచారణకు ఏప్రిల్ 28న కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆ రేంజ్‌లో గొడవ జరిగినప్పటికీ సూపర్ మార్కెట్ వాళ్లు… ఇద్దరు మహిళలకూ చెరో టాయిలెట్ ప్యాకెట్ మాత్రమే ఇచ్చారు.