24గంటల్లో రెండు లక్షలకు పైగా కేసులు.. అగ్రరాజ్యంలో 44 లక్షల మందికి కరోనా

  • Published By: vamsi ,Published On : July 28, 2020 / 08:15 AM IST
24గంటల్లో రెండు లక్షలకు పైగా కేసులు.. అగ్రరాజ్యంలో 44 లక్షల మందికి కరోనా

Updated On : July 28, 2020 / 12:18 PM IST

కరోనా వైరస్ ఊహించనదాని కంటే చాలా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంగా మారిపోయింది. గత 24 గంటల్లో ప్రపంచంలో 2.12 లక్షల కొత్త కేసులు నమోదవగా ఇదే సమయంలో 3,989 మంది చనిపోయారు.

కరోనా డేటాను పర్యవేక్షిస్తున్న వరల్డ్‌మీటర్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 66 లక్షల మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, మరణాల సంఖ్య ఆరున్నర లక్షలు దాటింది. ఇప్పటివరకు 6 లక్షల 55 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, ఈ వ్యాధి నుండి కోలుకున్న రోగుల సంఖ్య కోటి దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 57 లక్షల 56 వేల క్రియాశీల కేసులు ఉండగా వారికి చికిత్స కొనసాగుతోంది.

ప్రపంచంలో ఎన్ని కేసులు? ఎన్ని మరణాలు:
కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 44.32 లక్షలకు పైగా ప్రజలు సంక్రమణకు గురయ్యారు, లక్షకు పైగా 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అమెరికాలో 60 వేలకు పైగా కొత్త కేసులు రాగా, 577 మంది మరణించారు. అదే సమయంలో, కరోనా బ్రెజిల్లో వినాశనం కొనసాగిస్తోంది. బ్రెజిల్లో, సంక్రమణ కేసులు 24 లక్షలు దాటగా, 87 వేలకు పైగా ప్రజలు మరణించారు.

అమెరికా : కేసులు – 4,432,549, మరణాలు – 150,425
బ్రెజిల్ : కేసులు – 2,443,480, మరణాలు – 87,679
భారతదేశం : కేసులు- 1,482,503, మరణాలు – 33,448
రష్యా : కేసులు- 818,120, మరణాలు – 13,354
దక్షిణ ఆఫ్రికా: కేసులు – 452.529, మరణాలు – 7.067
మెక్సికో : కేసులు- 390,516, మరణాలు – 43,680
పెరూ : కేసులు – 384,797, మరణాలు – 18,229
చిలీ : కేసులు- 347,923, మరణాలు – 9,187
స్పెయిన్ : కేసులు – 325,862, మరణాలు – 28,434
యుకె : కేసులు- 300,111, మరణాలు – 45,759

18 దేశాలలో రెండు లక్షలకు పైగా కేసులు ప్రపంచంలోని 18 దేశాలలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2 లక్షలను దాటింది. వీటిలో ఇరాన్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ మరియు బంగ్లాదేశ్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా, అత్యధిక మరణాల పరంగా ఆరవ స్థానంలో ఉంది.

అమెరికాలో పరిస్థితి ఏంటంటే?
అమెరికాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1.5 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, గత ఒక రోజులో అమెరికాలో 60 వేలకు పైగా కొత్త కరోనా కేసులు సంభవించాయి. ముందు రోజు, 56 వేల కొత్త కేసులు రాగా.. అదే సమయంలో, 24 గంటల్లో 577 మంది మరణించారు.

అమెరికాలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 44 మిలియన్లు దాటింది. అదే సమయంలో లక్షా 50 వేల 425 మంది చనిపోయారు. ప్రజలు వ్యాధి నుండి కోలుకునే వేగం ఇంకా నెమ్మదిగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 21.33 లక్షల మంది కోలుకోగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 48.13 శాతంగా ఉంది. 21 లక్షల 48 వేల మందికి ఈ వైరస్ సోకింది. అదే సమయంలో, కరోనా సోకిన వారిలో మొత్తం 3.39 శాతం మంది అమెరికాలో మరణించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి, చాలా రాష్ట్రాల్లో చనిపోయిన వారి సంఖ్య వెయ్యికి పైగా ఉంది.