PituRooms : ప్రపంచంలోనే అతి సన్నని హోటల్.. ప్రత్యేకతలు మామూలుగా లేవుగా..

ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఓ హోటల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్ గా పేరొందింది.

PituRooms : ప్రపంచంలోనే అతి సన్నని హోటల్.. ప్రత్యేకతలు మామూలుగా లేవుగా..

world Most skinniest hotel

world Most skinniest hotel..PituRooms : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల హోటల్స్ ఉన్నాయి. కొన్ని అత్యాధునిక సదుపాయాలు ఉన్నవైతే..మరికొన్ని లగ్జరీ, సూపర్ లగ్జరీవైతే..ఇంకొన్ని వ్యూపాయింట్లకు స్పెషల్ గా ఉండేవి ఇలా చెప్పుకుంటు పోతే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పేరు పొందిన హోటల్స్ ఉన్నాయి. ఒక్కో హోటల్ ది ఒక్కో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఓ హోటల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది లగ్జరీయా..? సూపర్ లగ్జరీయా..? అనేది పక్కన పెడితే ఈ హొటల్ నిర్మాణమే ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎందుకంటే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ‘సన్నని’ హోటల్ గా పేరొందింది. ఈ హోటల్ అతి తక్కువ స్థలంలో కట్టిన హోటల్ గా ప్రసిద్ధి చెందింది.ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్‌లో నిర్మించిన ”పిటురూమ్స్” హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవనంగాను..అతి సన్నిని హోటల్ గాను రికార్డు సాధించింది.

ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర ఈ హోటల్ సృష్టికర్త. ఇతను సెంట్రల్ జావాలోని సలాటిగా నగరంలో పెరిగారు. ఆక్కిటెక్ట్ గా మంచి పేరు సంపాదించారు. ఇండోనేషియా రాజధాని జకార్తా, సింగపూర్ లలో పలు భవనాలు నిర్మించిన ఆర్టిటెక్ట్ గా పేరొందారు. ఈక్రమంలో సెంట్రల్ జావాలో అతి సన్నని హెటల్‌ నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ హోటల్ ని ప్రపంచ రికార్డు సాధించటానికి నిర్మించింది కాదు చిన్న పట్టణమైన సలాటిగా అంతర్జాతీయ దృష్టిని నిర్మించినదని చెబుతారు ఆరీ ఇంద్ర.

సలాటిగాలో 2022లో నిర్మించిన ఈ హోటల్ కేవలం తొమ్మిది అడుగుల వెడల్పుతో ఉంటుంది.ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీటర్లు. ఈ భవనంలో మొత్తం ఏడు గదులు, ఒక చిన్న లాంజ్ ఉంటాయి. ఇంటీరియర్ లేఅవుట్ సూపర్బ్ గా ఉంటుంది. ఒక ఎంట్రన్స్‌ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్‌డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది.

హోటల్ గదులు మధ్య క్రిస్‌క్రాసింగ్ మెట్లు, డెకరేషన్ ఐటెమ్స్ చక్కటి లుక్ తో ఆకర్షింస్తుంటాయి. ఈ హోటల్ లో మరీ ముఖ్యంగా వికలాంగుల కోసం చిన్న లిఫ్ట్ కూడా ఉంది. ఈ భవనంలో ఉన్న ఏడు గదుల్లో ఒక్కో రకమైన థీమ్ తో ఆకర్షణగా ఉంటాయి. ఒక్కో రూమ్ లో ఒక్కో రంగు థీమ్ తో విలక్షణంగా ఉంటాయి. ఈ రూముల్లో సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్‌తో కూడిన బాత్రూమ్‌ వంటి సౌకర్యాలకు ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా ఉంటాయి.

ఈ హోటల్ ఆర్కిటెక్ ఇంద్ర మాట్లాడుతు..ఇక్కడ మంచి ఆహారం, చక్కటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. మంచి జీవన ప్రమాణాలను కలిగి ఉన్న నగరంగా సలాటిగా పేరొందింది అని తెలిపారు. గతంలో డచ్ లకు వారాంతపు టూరిస్ట్ ప్లేస్ గా ఉండేదని..ఇండోనేషియన్లు సలాటిగాను రిలాక్స్ అవ్వటానికి మంచి ప్రదేశంగా భావిస్తారని తెలిపారు.