Weather Update: ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎన్నడూలేనంతగా నమోదు.. ఎంతగా అంటే?

యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ ఉష్ణోగ్రతలు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత అత్యధిక ఉష్ణోగ్రత ఎన్నడూ రికార్డు కాలేదు.

Weather Update: ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎన్నడూలేనంతగా నమోదు.. ఎంతగా అంటే?

Hottest day ever

Updated On : July 5, 2023 / 4:51 PM IST

Weather Update – World: ఎన్నడూలేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత బుధవారం 17.01 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ (US National Center for Environmental Prediction) తెలిపింది. అంతేకాదు, ఆ మరుసటిరోజే ఈ రికార్డు కూడా బద్ధలైందని వివరించింది.

జులై 4న 17.18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని చెప్పింది. యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ ఉష్ణోగ్రతలు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత అత్యధిక ఉష్ణోగ్రత ఎన్నడూ రికార్డు కాలేదు. వాతావరణ మార్పులు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి ఉదాహరణగా ఈ పరిణామం నిలుస్తోంది.

ఏదో ఒక ప్రాంతంలోనే కాక భూమి పై మొత్తం ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ దాటడం ప్రమాదరక విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు ఎల్ నినో (El Nino) ఏర్పడడానికి పరిస్థితులు 90 శాతం అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization) తెలిపింది.

ఎల్ నినో వల్ల సముద్ర జలాలపై ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెల్సియస్‌ అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల భూమి ప్రమాదపు అంచున ఉందని, కోలుకోలేని విధంగా నష్టం జరగవచ్చని శాస్త్రజ్ఞులు గత ఏడాది హెచ్చరించారు.

Ratan Tata : వర్షాకాలంలో కారు నడిపే ముందు రతన్ టాటా ఇచ్చే సూచన పాటించండి