×
Ad

China Bridge : ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. రెండు గంటల జర్నీ రెండు నిమిషాల్లోనే.. ఈ బ్రిడ్జ్ ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇవే..

China Bridge చైనాలోని గ్విజౌ ప్రావిన్సులో హువాజియంగ్ గ్రాండ్ కాన్యాన్‌లో బెయిపాన్ నది మీద ఈ బ్రిడ్జిని నిర్మించారు.

Huajiang Grand Canyon Bridge

China Bridge : అసాధ్యమనుకున్న ఇంజనీరింగ్ అద్భుతాన్ని చైనా సుసాధ్యం చేసింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బ్రిడ్జిగా చైనాలోని గ్విజౌ ప్రావిన్సులో హువాజి యాంగ్ గ్రాండ్ కాన్యాన్ బ్రిడ్జి (Huajiang Grand Canyon Bridge) నిలిచింది. ఈ బ్రిడ్జి లోయ అడుగు భాగం నుంచి ఏకంగా 625 మీటర్ల (సుమారు 2,050 అడుగుల) ఎత్తులో ఉంది. దీంతో ఇది ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా రికార్డు సృష్టించింది.

సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ బ్రిడ్జికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది కాన్వాన్ మీదుగా ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుంచి కేవలం రెండు నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 2,890 మీటర్లు. బ్రిడ్జి ఎత్తు 625 మీటర్లు (మునుపటి ప్రపంచ రికార్డు 565 మీటర్ల డ్యూగ్ బ్రిడ్జ్ కంటే 60మీటర్లు ఎక్కువ). ఇది షాంఘై టవర్ (చైనా అత్యున్నత భవనం) ఎత్తుకు సమానం.

గ్విజౌ ప్రావిన్సులో హువాజియంగ్ గ్రాండ్ కాన్యాన్‌లో బెయిపాన్ నది మీద ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మించేందుకు దాదాపు మూడున్నర సంవత్సరాల సమయం పట్టింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో అధునాతన సాంకేతికతలైన డోప్లర్ లైడర్, బైడియో పొజిషనింగ్, డిజిటల్ అసెంబ్లీని ఉపయోగించారు. గ్విజౌ ప్రావిన్సు ప్రపంచంలోని 100 అత్యున్నత బ్రిడ్జ్‌లలో కనీసం 30కి బ్రిడ్జ్‌లను కలిగి ఉంది. ఈ బ్రిడ్జ్ అక్కడి ప్రాంత అభివృద్ధికి, పర్యాటక వృద్ధికి దోహదపడుతుంది.

ఈ బ్రిడ్జి నిర్మాణంలో 22వేల మెట్రిక్ టన్నులు (మూడు ఈఫిల్ టవర్లకు సమానం) ఉక్కును వినియోగించారు. ఈ ఇంజనీరింగ్ అద్భుతం చైనా పర్వత మౌలికసదుపాయాల కల్పనలో మరో మైలురాయిగా నిలుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బ్రిడ్జి ప్రారంభానికి ముందు 96 ట్రక్కులు (3,300 టన్నులు) ఉపయోగించి టెస్టు చేశారు. టవర్లు, కేబుల్స్ లో ఒత్తిడిని చెక్ చేశారు.


ఈ బ్రిడ్జి కారణంగా రెండు గంటలు పట్టే ప్రయాణం రెండు నిమిషాల్లో పూర్తవుతుంది. మునుపు, కాన్వాన్ మీదుగా ప్రయాణించాలంటే గతంలో రెండు గంటలు పట్టేది. ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిడ్జి అందుబాటులో రావడంతో రెండు నిమిషాల్లో బ్రిడ్జి పై నుంచి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జి కారణంగా ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఆర్థిక పెరుగుదలకు దోహదపడుతుంది.