Viral Video: ఇది భారత్ కాదు.. పాకిస్థాన్‌లో నవరాత్రి సంబరాలు ఏ రేంజ్‌లో జరుపుకున్నారో చూడండి..
"హ్యాపీ నవరాత్రి ఫ్రం ఇండియా" అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.

Navratri in Pakistan
Viral Video: భారత్‌లో నవరాత్రి వేడుకలను ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. పాకిస్థాన్‌లోనూ ఈ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. అక్కడి హిందువులు జరుపుకున్న ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గార్భా, దాండియా నృత్యాలను ఎంతో ఉత్సాహంగా చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన హిందూ వ్యక్తి ప్రీతమ్ దేవ్రియా ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి హిందువులు ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్న దృశ్యాలను ఇందులో చూడవచ్చు.
Also Read: పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ.. ఎందుకంటే?
పాకిస్థాన్‌లో శాకాహారులు, జైనులు కూడా ఉంటారా? అని ఓ యూజర్ అడగగా ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని తెలిపారు. మరో వీడియోను కరాచీకి చెందిన ధీరజ్ అనే హిందూ పంచుకున్నారు. “హ్యాపీ నవరాత్రి ఫ్రం ఇండియా” అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతోంది. హిందూ మాసం ఆశ్వయుజ శుక్ల పక్షంలోని తొమ్మిది రాత్రులలో ప్రతిరోజు దుర్గమ్మ ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగ విజయదశమితో ముగుస్తుంది. నవరాత్రి సందర్భంగా నవదుర్గలను ఆరాధిస్తారు. గార్భా గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం. దాండియా అంటే కర్రలతో చేసే సంప్రదాయ నృత్యం.
View this post on Instagram
View this post on Instagram