XE recombinants virus : కరోనా కొత్త వైరస్ ‘XE Omicron’ లక్షణాలివే..!

XE recombinants virus : కరోనావైరస్ మహమ్మారి ఇంకా పోలేదు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ మరో కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది.

XE recombinants virus : కరోనావైరస్ మహమ్మారి ఇంకా పోలేదు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ మరో కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బెంబేలిత్తించిన ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది. ఈ వైరస్ వ్యాప్తి మూడో కరోనా వేవ్ కన్నా 10 రెట్లు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ కొత్త వైరస్‌కు సంబంధించి ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదైనట్లు WHO హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ యూకేలో జనవరి 19న తొలిసారిగా బయటపడింది. ఈ వైరస్‌కు సంబంధించి లక్షణాలను నిపుణులు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా మూడు హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్లు (XD, XF, XE) వ్యాప్తి చెందుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇంతకీ కొత్త వైరస్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. కరోనా వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్నవారిని బట్టి, అలాగే వారిలో రోగనిరోధక శక్తి స్థాయి ఆధారంగా ఒక్కొక్కరిలో ఒక్కొలా వైరస్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రధానంగా ఈ కొత్త వైరస్ సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో మంట, దగ్గు, జలుబు, చర్మం రంగు మారడం, చర్మం దురద, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు ఉంటున్నాయని గుర్తించారు. అలాగే ఈ వైరస్ తీవ్రత పెరిగితే.. వారిలో గుండె జబ్బులు, గుండెదడ, నరాల్లో తీవ్ర అనారోగ్యం వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Xe Recombinants Virus 10 Covid Symptoms To Watch Out For With Mutant Omicron Strain Circulating 

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ మూడో ప్రారంభమయ్యాక.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అయితే కరోనా విషయంలో ఎంతమాత్రం అలసత్వం తగదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. లేదంటే.. 4వ వేవ్ దాడి చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో చాలామంది మాస్క్ ధరించడం మంచిదే కానీ తప్పనిసరేం కాదని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. అమెరికా, యూకే, చైనా, హాంకాంగ్‌ దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లోనూ మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంతవరకు కోవిడ్ నిబంధనలను మరికొంతకాలం పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు 

ట్రెండింగ్ వార్తలు