Houses For Sale : ఈ టౌన్‌లో అమ్మకానికి ఇళ్లు.. రూ.87లకే కొనుక్కోవచ్చు!
ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.87లకే ఇళ్లు కొనుక్కోవచ్చు. అన్ని ఇళ్లల్లానే ఈ ఇళ్లల్లోనూ అన్ని వసతులు ఉంటాయి. ఇంతకీ ఎక్కడంటే?

You Can Buy Houses In This Beautiful Italian Town For Less Than Rs 80
You Can Buy Houses in Italian Town : ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.87లకే ఇళ్లు కొనుక్కోవచ్చు. ఇంత తక్కువ ధరకు ఎక్కడైనా ఇళ్లు అమ్ముతారా? అంటారా? కానీ ఈ టౌన్‌లో మాత్రం రూ.80ల నుంచి ఇళ్లను అమ్మకానికి పెట్టేశారు. అన్ని ఇళ్లల్లానే ఈ ఇళ్లల్లోనూ అన్ని వసతులు ఉంటాయి. ఇంతకీ అదెక్కడో తెలుసా? ఇటలీలోని Bisaccia అనే అందమైన టౌన్.. రోమ్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టౌన్‌లో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఎందుకు ఈ ఇళ్లను తక్కువ ధరకే అమ్ముతున్నారంటే.. అక్కడి 90వరకు ఇళ్లు చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో అందమైన ఈ నగరం ఇప్పుడు ఎవరు నివసించక బోసిపోయింది. అందుకే ఈ టౌన్ ఇళ్లల్లో జనాభా నివాసముండేలా ప్రోత్సహించేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఒకప్పటి నగరంలా అభివృద్ధి చెందేందుకు ఇలా విక్రయిస్తున్నామని పట్టణం డిప్యూటీ మేయర్ ఫ్రాన్సిస్కో టార్టాగ్లియా పేర్కొన్నారు.
టౌన్ అత్యంత పురాతనమైనది. ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదాని తర్వాత దగ్గరగా కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే ఉండేందుకు ఎంతో బాగుంటుందని ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఇళ్లను వారే మరమ్మత్తులు చేయించుకోవాలి. కొత్త ఇళ్లల్లా తీర్చిదీద్దుకోవాలి. పునర్నిర్మాణం చేసుకోవాలి. పెట్టుబడి స్థాయిని బట్టి ఇళ్లన పునర్నిర్మించాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసినా ఇళ్లను పునరుద్ధరించాలి. ఒప్పందంలో డిపాజిట్ గ్యారెంటీగా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. పునరుద్ధరణ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని ఎలా ఉపయోగిస్తారో చేసి చూపించాలి. ఒకప్పుడు ఉన్ని తయారీదారులు, చేతివృత్తుల వారితో ఈ టౌన్ ఎంతో సందడిగా ఉండేది.
Man Pregnancy : గర్భిణిలా రోజంతా బెడ్‌పై ఉండేందుకు ట్రై చేశాడు.. కట్ చేస్తే..!
20వ శతాబ్దంలో 1980లో తీవ్రమైన భూకంపాలు, విపత్తులతో ఈ టౌన్ తుడుచుపెట్టుకుపోయింది. ఆ తర్వాత నగరంలోని వారంతా భారీ వలసగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ నగరం ఎవరూ లేక బోసిపోయింది. ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పటి అందమైన నగరంలా తీర్చిదిద్దడంలో భాగంగా డజన్ల కొద్దీ పాడుబడిన లేదా ఖాళీ గుడిసెలను అమ్మకానికి ఉంచినట్టు తెలిపారు. ఇళ్ల విక్రయాల దరఖాస్తులు ఆగస్టు 28న ముగియనున్నాయి. త్వరలో మరిన్ని ఇళ్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయని మేయర్ ఫ్రాన్సిస్కో టార్టాగ్లియా తెలిపారు. లాడ్‌బిబుల్ ప్రకారం.. ఇటలీ గ్రామాల్లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడ నివాసానికి ప్రోత్సహించేందుకు గత ఏడాదిలోనే యూరో హౌసింగ్ స్కీమ్ అమల్లోకి తెచ్చారు.