United States : రూ.15 లక్షల ఇంటిని రూ.3 కోట్ల నివాసంగా మార్చడానికి ఓ మహిళ తెలివితేటలు చూడండి
పాత భవనానికి కొత్త రూపురేఖలు ఇచ్చింది. లక్షల్లో కొన్ని భవనాన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తిగా మార్చేసింది. ఓ మహిళ తెలివితేటలు చూస్తే మీరు ఔరా అంటారు.

United States
United States : బెట్సీ స్వీనీ అనే మహిళ రూ.15 లక్షలకు కొనుగోలు చేసిన ఇంటిని రూ.3 కోట్ల విలువైన ఇంద్ర భవనంలా మార్చేసింది. అందుకోసం ఆమె ఎలాంటి మార్పులు చేసింది?
United States : ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన గుమ్మడికాయ.. దానికి ఎవరి పేరు పెట్టారో తెలుసా?
2020 లో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో బెట్సీ స్వీనీ అనే మహిళ $18,000 ( ఇండియన్ కరెన్సీలో 1,49,84,064.00) లకు నివాస యోగ్యంగా లేని ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ఇంటి మార్కెట్ విలువ $375,000 (ఇండియన్ కరెన్సీలో 31.221.562,50) పలుకుతోంది. అంతలోనే ఇంత వాల్యూ చేస్తుందా? అని మీకు డౌట్ రావచ్చు. బెట్సీ స్వీనీ ఆ ప్రాపర్టీని సౌకర్యవంతమైన ఇల్లుగా మార్చడం ద్వారా ఆ ఆస్తి విలువ అమాంతంగా పెరిగిపోయింది.
కన్‌స్ట్రక్షన్ రంగంలో ఎక్స్‌పర్ట్ అయిన 30 ఏళ్ల బెట్సీ స్వీనీ 120 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసింది. దానికి తిరిగి పునర్వైభవం ఎలా తీసుకురావాలా అని ఆలోచించింది. పాకెట్ డోర్లు, విక్టోరియన్ ఫైర్ ప్లేస్‌లు.. పాతకాలపు బాత్ టబ్ వంటి వాటి పునర్నిర్మాణ విషయంలో $100,000 (ఇండియన్ కరెన్సీలో ₹8324000) నిర్మాణ రుణం తీసుకుంది. ఇక నిర్మాణం విషయంలో ఎక్స్‌పర్ట్స్‌ని నియమించుకుంది. బెట్సీ స్వీనీకి భర్త నుంచి కూడా సహకారం అందింది. ఈ బిల్డింగ్ పునర్నిర్మాణ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
మొత్తానికి పాత భవనానికి కొత్త హంగులు దిద్ది దాని రూపురేఖలు మార్చేసిన బెట్సీ స్వీని ఇలా చారిత్రాత్మక ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో కొత్తగా కొనుగోలు చేసిన దాని కంటే చాలా ఎక్కువ తిరిగి ఆస్తిని అందిస్తుందని చెబుతోంది. తిరిగి తన భవనాన్ని అమ్మవలసి వస్తే $240,000 (ఇండియన్ కరెన్సీలో 1,99,73,880.00) లిస్ట్ చేస్తానని చెబుతోంది. పాత నిర్మాణాలకు కాస్త పెట్టుబడి పెట్టి ఆధునాతన సౌకర్యాలు జోడించడం ద్వారా వాటి రూపు రేఖలు మార్చడంతో పాటు లాభాలు గడించవచ్చని బెట్సీ స్వీనిని చూస్తే అర్ధం అవుతుంది.
View this post on Instagram
View this post on Instagram