Zabiba and the King : సద్దాం హుస్సేన్.. రాసిన రొమాంటిక్ నవల చదివారా?

Saddam Hussein romantic novel Zabiba and the King : ఆయనో నియంత… ప్రపంచ దేశాలకు ముచ్చెటమలు పట్టించాడు.. దేశాధ్యక్షుడిగా ఇరాక్‌కు అనేక సేవలు చేశాడు… పదవిని కాపాడుకోవడం కోసం అత్యంత క్రూరుడిగా మారాడు.. సద్దాం హుస్సేన్ 1979 నుంచి 2003 వరకు ఇరాక్‌ను నియంతల పాలించాడు.. తనకు ఎదురొచ్చినవాళ్లను హతమార్చాడు..
నియంత పాలన సాగిస్తూ అగ్ర రాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వాడు.. అదే సద్దాం పతనానికి కారణమైంది. అమెరికా సైన్యానికి చిక్కిన సద్దాం.. 2006 డిసెంబర్ 30న ఉరితీశారు. ప్రపంచానికి తానొక నియంతలా.. క్రూరుడిగా మాత్రమే తెలుసు.. ఆయనలో ఎవరికి తెలియని రొమాంటిక్ కోణం ఉందని తెలియదు.. నియంత పాలన సాగించినప్పటికీ ఆయనలో తెలియని ఓ మంచి రచయిత కూడా ఉన్నాడు.. ఎన్నో నవలలు రాసిన అనుభవం ఆయన సొంతం.. కానీ పాపులర్ అయింది మాత్రం ఒకే ఒక్క రొమాంటిక్ నవల..
అదే.. Zabiba and the King’… ఈ లవ్ స్టోరీలో ప్రధాన పాత్రలో జబీబా అనే అమ్మాయికి పెళ్లి అవుతుంది.. ఆమె భర్త మంచివాడు కాదు.. ఎప్పుడూ భార్య జబీబాను హింసిస్తుంటాడు.. అత్యాచారం చేస్తుంటాడు.. ఇరాక్ రాజు ఆమెను ప్రేమిస్తాడు.. తన ప్రేయసిని హింసించిన వారిపై ఇరాక్ రాజుగా ప్రతీకారం తీర్చుకుంటాడు.. తాను కూడా మరణిస్తాడు.. ఈ రొమాంటిక్ నవల మొత్తం ఇరాక్ చరిత్రను వివరిస్తుంది. దేశంలో ఆనాటి సంఘటనలకు నిలువటద్దంగా చెప్పొచ్చు. 2000 ఏడాదిలో సద్దాం ఈ నవలను రాశాడు. ఈ నవలను అప్పటి పరిస్థితులను అద్దం పట్టేలా సద్దాం రాశారు.
https://10tv.in/novak-djokovic-disqualified-from-us-open-2020/
నవలలో జబీబా అనే పాత్రను ఇరాక్ ప్రజలుగా, క్రూరమైన భర్తగా అమెరికాను సద్దాం అభివర్ణించాడు. Zabiba and the King అనే 160 పేజీల రొమాంటిక్ నవలను వేలాది సంవత్సరాల క్రితమే సద్దాం రాశారు.. సద్దాం ఈ పుస్తకాన్ని స్వయంగా రాశారా అనే దానిపై కొంత చర్చ జరిగింది.
సద్దాం రచించిన నాలుగు నవలలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సైట్లో Zabiba and the King అనే ఈ నవల అందుబాటులో ఉంది. సద్దాం రాసిన రొమాంటిక్ నవల చదవాలనుకుంటే అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు..