Mark Zuckerberg : జూకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన మెటా సీఈఓ

మెటా సీఈఓ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. MMA ఫైట్ కోసం శిక్షణ తీసుకుంటున్న క్రమంలో జుకర్‌బర్గ్ మోకాలికి గాయం అయ్యింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న జుకర్ బర్గ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

Mark Zuckerberg : జూకర్ బర్గ్  మోకాలికి శస్త్ర చికిత్స.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన మెటా సీఈఓ

Mark Zuckerberg

Mark Zuckerberg : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీకి శిక్షణ ఇస్తున్నప్పుడు మోకాలికి గాయం అయినట్లు జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు.

Mark Zuckerberg Phone : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాడే ఫోన్ ఇదేనట.. ఐఫోన్ మాత్రం కాదు.. అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం..!

మోకాలికి గాయంతో జుకర్‌బర్గ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి బెడ్ పై ఎడమ కాలుకి బ్యాండేజ్, సపోర్టివ్ లెగ్ బ్రేస్ తో కనిపిస్తున్న ఫోటోలను జుకర్‌బర్గ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎంఎంఏ ఫైట్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో గాయం అయినట్లు తెలుస్తోంది. .

జుకర్‌బర్గ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మోకాలికి తగిలిన గాయానికి ACL శస్త్ర చికిత్స చేయడం ద్వారా బయటపడ్డాను..నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న MMA ఫైట్ కోసం శిక్షణ పొందుతున్నాను.. కానీ ఇప్పుడు అది కాస్త ఆలస్యమైంది..గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి శిక్షణ ప్రారంభిస్తాను. ఈ సమయంలో ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ పోస్టు పెట్టారు.

Harsh Goenka : జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్మూలాను షేర్ చేసిన హర్ష్ గోయెంకా

స్టాన్ ఫోర్డ్ మెడిసిన్ ప్రకారం ACL శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందట. దాదాపుగా 9 నుండి 12 నెలలు పడుతుందని అంచనా. జుకర్‌బర్గ్ త్వరగా కోరుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు.

 

View this post on Instagram

 

A post shared by Mark Zuckerberg (@zuck)