CSK vs MI LIVE IPL 2020: వికెట్ పడకుండా ఉతికేశారు.. చెన్నైపై ముంబై విజయం

[svt-event title=”చెన్నై ఫ్లాప్ షో.. ముంబై 10వికెట్ల తేడాతో ఓటమి” date=”23/10/2020,10:23PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్లాప్ షో కొనసాగుతుంది. ముంబైతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. [/svt-event]
[svt-event title=”పరువు కాపాడిన శామ్ కర్రన్.. చెన్నై స్కోరు 114/9.. ముంబై టార్గెట్ 115″ date=”23/10/2020,9:28PM” class=”svt-cd-green” ] చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై బౌలర్ల చేతిలతో చిత్తు అయ్యింది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి కేవలం 114పరుగులు చేసింది. ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఏ మాత్రం నిలబడలేకపోయారు. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ అభిమానులను నిరాశపరచగా.. ఆల్‌రౌండర్ శామ్ కర్రన్ మాత్రమే మైదానంలో నిలబడి చెన్నై జట్టు పరువు కాపాడాడు. కనీసం వంద పరుగుల మార్క్ కూడా క్రాస్ కాలేదేమో అని భావించిన తరుణంలో 47బంతుల్లో 52పరుగులు చేసి చెన్నై జట్టు స్కోరును 114పరుగులకు తీసుకుని వెళ్లాడు. జట్టు భారం మొత్తాన్నీ తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించాడు. కర్రన్‌కు తోడుగా తాహీర్ కాసేపు క్రీజులో స్ట్రైక్ రొటేట్ చేశాడు. 43పరుగుల పార్ట్‌నర్ షిప్ అందించాడు. 71పరుగులకే 8వికెట్లు పడిపోగా.. తర్వాత శామ్ కర్రన్ తాహీర్ క్రీజులో నిలబడ్డారు. [/svt-event]
[svt-event title=”డూ ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేసిన చెన్నై.. 24/5″ date=”23/10/2020,8:12PM” class=”svt-cd-green” ] ప్లే ఆఫ్ బెర్తులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై చేతులెత్తేసింది. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగియక ముందే చెన్నై కీలకమైన 5వికెట్లు కోల్పోయింది. 5వ వికెట్‌గా జడేజా ఆరవ ఓవర్ రెండవ బంతికి(5.2) కృనాల్ పాండ్యా చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 5వికెట్లు నష్టపోయి కేవలం 24పరుగులు చేసింది. [/svt-event]
[svt-event title=”మూడు పరుగులకే నాలుగు వికెట్లు.. కష్టాల్లో చెన్నై” date=”23/10/2020,8:02PM” class=”svt-cd-green” ] షార్జా వేదికగా చెన్నై, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. ఫస్ట్‌లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బౌల్ట్ విసిరిన ఐదో బంతికి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ lbwగా డకౌట్ అయ్యాడు.
అనంతరం అంబటి రాయుడు క్రీజులోకి వచ్చినట్లు వచ్చి.. మూడు బంతుల్లో రెండు పరుగులు చేసి డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెంటనే క్రీజులోకి వచ్చిన జగదీశన్ స్లిప్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటికే బౌల్ట్ తన రెండో ఓవర్లో 2 పరుగలిచ్చి వికెట్ తీశాడు. బౌల్ట్ విసిరిన ఐదో బంతికి డుప్లెసిస్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 3 ఓవర్లలోనే 4 వికెట్లు చేజార్చుకుంది చెన్నై జట్టు. ప్రస్తుతం ధోనీ (9), జడేజా (7) క్రీజులో ఉన్నారు. [/svt-event]
[svt-event title=”చెన్నై సూపర్ కింగ్స్(Playing):” date=”23/10/2020,7:52PM” class=”svt-cd-green” ] సామ్ కరన్, డుప్లెసిస్, రుతురాజ్, రాయుడు, జగదీశన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, హాజిల్‌వుడ్ [/svt-event]
[svt-event title=”ముంబై ఇండియన్స్(Playing): ” date=”23/10/2020,7:52PM” class=”svt-cd-green” ] డికాక్, తివారి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా [/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన ముంబై.. చెన్నై బ్యాటింగ్” date=”23/10/2020,7:18PM” class=”svt-cd-green” ] ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. బౌలింగ్ ఎంచుకుని చెన్నై జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. [/svt-event]
[svt-event title=”పరువు కోసం చెన్నై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ముంబై:” date=”23/10/2020,7:11PM” class=”svt-cd-green” ] ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో పోరుకు సిద్ధం అవుతుంది. షార్జా వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తమ చెన్నై సూపర్ కింగ్స్‌పై పోరుకు సిద్ధమైంది చెన్నై.
వరుస పరాజయాలతో సిరీస్‌లో ఇబ్బందులు పడుతున్న చెన్నై ఒక వైపు అయితే వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ సిరీస్‌లో లీడ్ పొజిషన్‌లో ఉన్న ముంబై మరోవైపు పోటీ పడుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చెన్నై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ముంబై పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. [/svt-event]