తడబడి.. నిలబడి.. కోల్‌కత్తా భారీ స్కోరు.. 42/3నుంచి 194/6.. ఢిల్లీ టార్గెట్ 195

టీ20 లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీపై కోల్‌కతా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. కోల్‌కత్తా బ్యాటింగ్‌కు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా 42పరుగులకే 3వికెట్లు నష్టపోగా.. కష్టాల్లో పడింది.
ఆ సమయంలో నితీష్ రానా, సునీల్ నరైన్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. 157పరుగుల వరకు వికెట్ పడకుండా ఆడి కోల్‌కత్తా స్కోరును నడిపించారు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది కోల్‌కత్తా జట్టు.
కోల్‌కతా తరఫున సునీల్ నరైన్ 32 బంతుల్లో 64పరుగులు చెయ్యగా, నితీష్ రానా 53 బంతుల్లో 81 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రబాడా, స్టోయినిస్, నార్ట్జే తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కత్తా..మొదట్లోనే తడబడింది. రెండో ఓవర్లో 11 పరుగుల స్కోరుపై అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షుబ్మాన్ గిల్ 09 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఆరో ఓవర్లో 35 పరుగుల స్కోరుతో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రాహుల్ త్రిపాఠి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
రెండు వికెట్లు పడటంతో, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దినేష్ కార్తీక్‌ను నాలుగవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపగా.. కార్తీక్ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 42 పరుగులకు మూడు వికెట్లు పడటంతో మోర్గాన్ సునీల్ నరైన్‌ను బ్యాటింగ్‌కు దింపగా.. అక్కడ నుంచి రానా నాలుగో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. నరైన్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు, రానా 13 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. చివరికి, కెప్టెన్ మోర్గాన్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు స్కోరును 190కి తీసుకువచ్చాడు. అతను రెండు ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టాడు.
అదే సమయంలో ఎన్రిక్ నార్ట్జే ఢిల్లీ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేయగా.. తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం 27 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా మార్కస్ స్టోయినిస్ కగిసో రబాడా రెండు వికెట్లు పడగొట్టాడు.
Innings Break!
Half-centuries by Nitish Rana and Sunil Narine, guide #KKR to a formidable total of 194/6 on the board.Will #DelhiCapitals chase this down? Stay tuned.#Dream11IPL pic.twitter.com/xO2vVKWwlf
— IndianPremierLeague (@IPL) October 24, 2020