Police Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, భారీగా పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ

తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

Police Recruiment

Police Recruitment : తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20వేల పైచిలుకు కానిస్టేబుళ్ల పోస్టులు, 625 ఎస్ఐ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుందని వార్తలు వస్తున్నాయి.

డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆ నివేదికను ఆర్థికశాఖకు అందించారు. ఆర్థికశాఖ నుంచి ఆమోదం రాగానే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే ఛాన్సుంది. మరోవైపు తెలంగాణలో నూతన జోనల్‌ వ్యవస్థ కూడా అమలులోకి వచ్చింది. పోలీసు నియమకాలను కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారానే.. చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం‌.