Gurugram Bans 11 dog breeds : గురుగ్రామ్‌లో 11 రకాల కుక్కల జాతులపై నిషేధం..పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం బయటకు తీసుకురావొద్దని ఆదేశం
గురుగ్రామ్ లో 11 రకాల జాతుల కుక్కలపై నిషేధం విధించారు. గురుగ్రామ్ వాసులు వివిధ రకాలకు చెందిన 11 జాతుల్లో ఏజాతి కుక్కను పెంచుకుంటున్నా..లైసెన్స్ రద్దు చేయాలని..పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం బయటకు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

Gurugram bans 11 dog breeds
Gurugram bans 11 dog breeds: గురుగ్రామ్ లో 11 రకాల జాతుల కుక్కలపై నిషేధం విధించారు. గురుగ్రామ్ వాసులు వివిధ రకాలకు చెందిన 11 జాతుల్లో ఏజాతి కుక్కను పెంచుకుంటున్నా..లైసెన్స్ రద్దు చేయాలని వినియోగదారుల ఫోరం గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్పష్టం చేసింది. సాధారణంగా జాతి కుక్కలను చాలామంది ఇష్టపడి పెంచుకుంటుంటారు. కానీ గురుగ్రామంలో ఇక నుంచి 11 జాతులకు చెందిన కుక్కల్ని పెంచుకోవటంపై నిషేధం విధించిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఇటీవల కాలంలో కుక్క కాటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. ఆఖరికి పెంపుడు కుక్కలు కూడా ప్రజలను కరుస్తున్న ఘటనలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఓ మహిళ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా ఫోరం 11 జాతుల కుక్కలపై నిషేధం విధించింది.
వివరాల్లోకి వెళితే..దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉండే గురుగ్రామ్ లో ఇటీవల కుక్క కాటు ఘటనలు బాగా పెరిగాయి. దీంతో గురుగ్రామ్ వాసులు కుక్కలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. వీధి కుక్కలు జనాలను కరుస్తుంటం పరిపాటే..కానీ పెంపుడు కుక్కలు కూడా ప్రజలను కరుస్తున్న ఘటనలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఓ కుక్క కాటుకు గురై తీవ్రగాయాలపాలైన ఓ మహిళ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. దీంతో ఫోరం కీలక నిర్ణయం తీసుకుంది. 11 రకాల విదేశీ కుక్కలను పెంచుకోవడంపై నిషేధం ప్రకటించాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్పష్టం చేసింది.
Gurugram Woman: ‘కుక్క దాడి చేసినందుకు బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలి’.. ‘ఫోరం’ ఆదేశం
నిషేధం విధించిన కుక్కల జాతులు..
1.అమెరికన్ బుల్ డాగ్ 2. అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్ 3. డాగో అర్జెంటీనో 4. రాట్ వీలర్ 5. బోయర్ బోయెల్ 6. ప్రెసా కనారియో 7. నీపోలీషియన్ మాస్టిఫ్ 8. ఉల్ఫ్ డాగ్ 9. కేన్ కోర్సో 10. బాండాగ్ 11. ఫిలా బ్రసీలీరో జాతులపై నిషేధం విధిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కు స్పష్టం చేసింది.
ఇవి ఎంతో ప్రమాదరకరమైన విదేశీ జాతులు అని ఫోరం అభిప్రాయపడింది. గురుగ్రామ్ వాసులు ఈ 11 జాతుల్లో దేన్ని కలిగి ఉన్నా, దాని లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం నిర్దేశించింది. ఆయా కుక్కలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అలాగే కుక్క కాటుకు గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. కాగా..సదరు బాధిత మహిళను కరిచిన కుక్క డాగో అర్జెంటీనో జాతికి చెందినదిగా గుర్తించారు.
అంతేకాదు పెంపుడు కుక్కలను మలవిసర్జన కోసం వీధుల్లోకి తీసుకురావొద్దని వాటి యజమానులను ఆదేశించింది. అందుకోసం ప్రత్యేకంగా మలవిసర్జన సంచులను ఉపయోగించాలని స్పష్టం చేసింది.
Gurugram bans 11 dog breeds: Know them and why they are a problem